ఎన్నికలు వచ్చాయంటే చంద్రబాబు తన దగ్గర ఉన్న దొంగ హామీల మంత్ర దండం బయటికి తీస్తాడు. నోటికి వచ్చిన హామీలని బిగ్గరగా అరిచి మరీ ఇస్తాడు. తన రాజకీయ జీవితం మొత్తంలో ఇచ్చిన ఏ హామీనీ సంపూర్ణంగా నేరవేర్చిన చరిత్రే లేని చంద్రబాబు, ప్రతీ ఎన్నికలకు ఓట్లు దండుకునేందుకు అస్త్రంగా మాత్రమే మేనిఫెస్టోని చూస్తాడు. 1995లో పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు గారినే గద్దె దింపి ఆ సీటు మీద కూర్చున్న చంద్రబాబు నాటి నుండి ప్రజలను మోసం చేయని రోజు లేదు.
1994 మానిఫెస్టొలో రామారావు గారు ఇచ్చిన ప్రదానమైన హామీలైన, “రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేదం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్” లాంటి వాటిని వివిద సాకులు చూపుతూ ఎత్తేసి ప్రజల నడ్డి విరిచిన చరిత్ర చంద్రబాబుది. ఇక 1999 మానిఫెస్టొలో చంద్రబాబు ఇచ్చిన ప్రదానమైన హామీలు చూస్తే “కోటి ఉద్యోగాలు, 100 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, సంవత్సరానికి 7 లక్షల ఇళ్ళు” వీటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నేరవేర్చలేదు . ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014 మానిఫెస్టొలో ఇచ్చిన ప్రదానమైన హామీలు చూస్తే “సంపూర్ణ రుణమాఫి, ఇంటీకొక ఉద్యొగం, డ్వాక్రా రుణమాఫి” హామీలను నేరవెర్చకపోగా మేనిఫెస్టోనే ప్రజలకి అందుబాటులో లేకుండా వెబ్సైట్ నుండి తీసేసిన ఘనమైన చరిత్ర చంద్రబాబు సొంతం.
చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తంలో ఒక్క రోజుకూడా చెప్పిన మాటపై నిలబడలేదు. క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా రాజకీయల్లో ముద్ర పడ్డ చంద్రబాబు నేడు సూపర్ సిక్స్ అంటూ గారడీ మాటలు బురిడి కబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలుగుదేశం నేతల నుండే వస్తున్న మాట . మళ్ళీ మళ్ళీ అదే మోసం చేస్తే ప్రజలు గుర్తించలేని భ్రమపడటం చంద్రబాబు ఔడేటడ్ రాజకీయానికి నిదర్శనం అని రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న మాట. డ్వాక్రా మహిళలకి వడ్డి లేని రుణం అన్నా, ఉచిత బస్సులు అన్నా, వాలంటీర్లకి పదివేలన్నా , ఉచిత గ్యాస్ బండలన్నా, రేపటి రోజున ఇంటికో కేజీ బంగారం బెంజ్ కారన్నా చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేకపోవడం తెలుగుదేశానికి మింగుడుపడని అంశంగా మారింది..