తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం దానిని నెరవేర్చకుండా కుంటిసాకులు చెప్పడం పరిపాటే. ఎన్నికల తాయిలాలు ప్రకటించి ప్రజలను మోసం చేయడం. ప్రశ్నించిన వారినే దబాయించి మాట్లాడటం 5ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలందరూ కూడా చూసారు. అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చే సరికి సరికొత్త మోసాలతో వచ్చే బాబు ఈసారి సూపర్ సిక్స్ పేరుతో మిని మ్యానిఫెస్టోని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాటిని నేరవేరుస్తాం అంటూ ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది ఇలా ఉంటే నేడు సీఎం జగన్ తన మ్యానిఫెస్టోని విడుదల చేస్తూ తెలుగుదేశం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. ప్రజలందరు అనుకుంటునట్టే చంద్రబాబు ఇచ్చిన హామీలు నేరవెర్చడం సాధ్యమయ్యే పని కాదని ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఆ హామీలు అమలకి సహరించందని లెక్కలతో సహా వివరించి చంద్రబాబు మోసపు హామీలని ప్రజలకి అర్ధమయ్యే రీతిలో వివరించారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి రుణమాఫి , డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ పలు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత మ్యానిఫెస్టోని మాయం చేసిన చంద్రబాబు పాలనను గుర్తు చేశారు జగన్.
జగన్ చూపిన లెక్కల వివరాలు చూస్తే ఆడబిడ్డ కింద నిధి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ కు నెలకు 1,500/- ఇస్తే మోత్తం 37,313 కోట్లు ఖర్చు అవుతుందని, దీపం పధకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే 4,634 కోట్లు ఖర్చు అవుతుందని, తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్న వారి చదువుకి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 ఇస్తే 12,450 కోట్లు అవుతుందని, అన్నదాత కింద ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం చేస్తే ఏడాదికి 10,706 కోట్లు ఖర్చు అవుతుందని, స్థానిక బస్సుల్లో మహిళలందరికి ఉచిత ప్రయాణం స్కీం కింద 2,500 కోట్లు వరకు ఖర్చు అవుతుందని, యువగళం కింద 20 లక్షల మంది యువతకు ఉపాధి. నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తే 7,200 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా సూపర్ సిక్స్ పధకాల వరకే 74,803 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చేశారు.
ఇక వీటికి తోడుగా చంద్రబాబు ఇస్తున్న మరి కొన్ని హామీలు చూస్తే పెన్షన్లు 4000, అంగవైకల్యం ఉన్న వారికి 6000 ఇస్తే మోత్తం 36,686 కోట్లు ఖర్చు కనిపిస్తుందని, బీసీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ను అమలు చేస్తాం అని చెప్పిన దానికి నెలకు 4,000 చొప్పున ఇస్తే 6,249 కోట్లు ఖర్చు అవుతుందని, బీసీలకు లక్ష చొప్పున కళ్యాణమస్తు స్కీం ఇస్తే 333.40 కోట్లు, వాలంటీర్లకు 10వేలు ఇస్తే 3,192 కోట్లు చేనేతలకి 500 యునిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తే 355.90 కోట్లు అవుతుందని మొత్తం కలిపితే 46,816 కోట్లు ఖర్చు అవుతుందని, ఇక సూపర్ సిక్స్ , పైన చెప్పిన హామీలు రెండు కలిపితే 1,21,619 కోట్లు ఏడాదికి బడ్జెట్ నుండి ఖర్చు చేసే పరిస్థితి అని చెప్పుకొచ్చారు.
వీటితో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అమలవుతున్న పధకాల్లో ఆపకుండా అమలు చేయవలసినవి చూస్తే 9 లక్షలమంది విద్యార్ధులకి ఫీజు రీయంబర్స్ మెంట్ కింద ఏడాదికి 2,800 కోట్లు, 9 లక్షలమంది విద్యార్ధులకి వసతి దీవెన కింద 2,200 కోట్లు , ఆరోగ్యశ్రీ , ఆరోగ్య ఆసరా, 108, 104 కింద 4,400 కోట్లు, మధ్యాహ్న భోజన పధకం, గోరు ముద్ద కింద 1,900 కోట్లు, సంపూర్ణం పోషణ కింద 2,200 కోట్లు, ఉచిత బియ్యం కింద 4,600 కోట్లు, ఉచిత విధ్యుత్ కింద 11,000 కోట్లు మొత్తం కలిపి 29,100 కోట్లు తప్పనసరిగా ఖర్చు చేయవలసిన పధకాలు అని ఇక మొత్తం కలిపి చూస్తే 1,50,718 కోట్లని బడ్జెట్ నుండి ఇంత ధనం ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని చంద్రబాబు ఓట్ల కోసమే ఇస్తున్న హామీలు తప్ప వాటిని అమలు చేసే ప్రణాళిక చంద్రబాబు దగ్గర ఎప్పుడు ఉండదని దానికి ఉదాహరణ 2014లో ఆయన ఇచ్చి ఎగ్గొట్టిన హామీలే సాక్ష్యమని ప్రజలందరికి అర్ధమయ్యేలా లెక్కలతో వివరించారు. జగన్ చెప్పిన లెక్కలు చూస్తే చంద్రబాబు మరో అడ్డగోలు మోసానికి ప్రణాళికలు సిద్ధం చేశారనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతుంది అని చెప్పవచ్చు .