దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సంక్షేమ పాలన అందించి పేదల పాలిట తన కమిట్మెంట్ ని నిరూపించుకున్న జగన్, రాజకీయ యవనిక పై తనకంటూ ఒక ముద్ర ఉండిపోయేలా చేసుకున్నారు. పోరాట యొధుడిగా, సంక్షేమ సారధిగా జగన్ పేదల మనసుల్లో గూడుకట్టుకున్నారనేది కాదనలేని సత్యం. 5ఏళ్ళు పాలించడానికి ప్రజలు తీర్పు ఇస్తే 2ఏళ్ళు కరోనాతో పోయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా సంక్షేమం అందించి ప్రజలని ఆదుకున్న తీరు దేశ వ్యాప్తంగా ప్రశంసనీయంగా మారింది.
అన్ని విధాలుగా పేదలకి తోడుగా నిలిస్తూనే సంక్షేమంతో పాటు అభివృద్దిని తన ఎజండాలో చేర్చుకుని ముందుకు సాగిపోతున్న జగన్ పై రాజకీయ విమర్శలు చేయటానికి ఆస్కారంలేక చంద్రబాబు ఆయన వందిమాగధులు నిత్యం జగన్ పై తలాతోక లేని వ్యక్తిగత విమర్శలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు చేసిన మరో ఆరోపణ చెల్లెలు షర్మిలకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పు ఇచ్చిన జగన్, ఇక రాష్ట్రంలో ఆడవారికి ఏం న్యాయం చేస్తారని , ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్ అని కాబట్టి తెలుగుదేశంతోనే ఆడవారికి భరోసా అని ఊకదంపుడు ప్రచారం మోదలుపెట్టారు.
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నే కుర్చి కోసం పోటు పోడిచిన చంద్రబాబు ఆయన పేరు వాడుకోవటానికి అనర్హుడని ఎంతమంది ఎన్ని విదాలుగా చెప్పినా పట్టించుకోని చంద్రబాబు సమాజోద్దారకుడిలా మాట్లాడటం హాస్యాస్పధం. చంద్రబాబు సొంత పెద్దమ్మ నారా సిద్దమ్మ తన భూమిని చంద్రబాబు కబ్జా చేశాడని స్వయంగా చెప్పింది. ఆ నలుపుపై మాట్లాడే సహాసం చేయని చంద్రబాబు శర్మిలా , జగన్ ఆస్తుల వ్యవహారంపై మాట్లాడటం నైతికత ఎలా అనిపించుకుంటుందని వేస్తున్న ప్రశ్నలకు తెలుగుదేశం వారిదగ్గరే సమాధానంలేదు.
ఇక మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్ అనేది మరో అర్దసత్యం 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు బిల్లును ప్రతిపాదించినప్పటికి శాసన సభలో ఆమోదం పొందినా శాశనమండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. ఈ బిల్లుని ఆమోదించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని సభ్యులు లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న నాటి మండలి స్పీకర్ ఈ బిల్లుని సెలక్ట్ కమిటీకి రిఫర్ చేశారు, మండలి రద్దు తరువాత 1985 సెప్టెంబర్ 5న ఈ బిల్లును తిరిగి అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది నాటి ఎన్టీఆర్ ప్రభుత్వమే అయినప్పటికి ఇది అమలుకు నోచుకోలేదు. గవర్నర్ ఆమోదం పొందలేదు. అయితే నిజానికి ఈ మహిళ ఆస్తి హక్కు చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది 2005లో మన్మోహన్ సింగ్ ఆద్వర్యంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే చంద్రబాబు నిత్యం ఎన్టీఆర్ పాలన్లోనే అమల్లోకి వచ్చినట్టు మాట్లాడటం అత్యంత హాస్యాస్పదం.
నోరు తెరిస్తే అసత్యాలు మాత్రమే పలికే చంద్రబాబు తన వెనుక ఉన్న నలుపుని చూసుకునే సాహసం చేయకుండా పక్క వారి కుటుంభాల్లో రాజకీయాలకు సంభంధంలేని వ్యవహారాల్లో వేలుపెట్టి రాజకీయ లబ్దిపోందాలనుకొవడం ఆయనకే చెల్లిన నీతిమాలిన చర్య అని పలువురు చెబుతున్న మాట . చంద్రబాబు వాచాలత తన రాజకీయ పతనానికే దారితీస్తుంది తప్ప మరో ఉపయొగం ఉండదనేది ఆయన ఎప్పటికి గ్రహిస్తారో కాలమే నిర్ణయిస్తుంది .