ఏపిలో నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమీషన్ కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సంచలనం సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన వివరాలు రాజకీయ వర్గాల్లో టీడీపీ,జన సేన పొత్తు మీద జరిగిన ఎన్నో విషయాలను పటాపంచలు చేసిందని తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ అత్యుత్సాహంగా స్పందించడం మనకందరికీ తెలుసు. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగాయి అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేసారని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు . ఇప్పుడు అది నిజమే అన్నట్టు చంద్రబాబు జైలు నుండి విడుదల ఆయిన అక్టోబర్ 31 తరువాత కేవలం రెండు రోజులకే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల మీద, తన పేరు మీద బ్యాంకుల్లో పెద్ద ఎత్తున కోట్లలో డబ్బులను ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఇప్పుడు అదే ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబుకు బేషరుతుగా మద్ధతు ఇస్తున్నానని ప్రకటించి చంద్రబాబు కోసం అటు బిజెపి పెద్దలతో మాట్లాడి తెలంగాణలో పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబు బెయిల్ మీద బయటకు రాగానే కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోజుల్లో ప్రతి మీడియాలో పలు విశ్లేషణల్లో జోరుగా చర్చలు జరిపారు అయితే పవన్ కళ్యాణ్, జన సేన పార్టీ దీనిని తోసిపుచ్చినా టీడీపీ నాయకులు దీనిని ఖండించకుండ మిన్నకుండి పోవడం అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది .
అప్పుడు దాని మీద జన సేన నాయకుడు , పవన్ కళ్యాణ్ అన్న అయిన నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు, పిల్లల ఫీజులు కట్టడానికి డబ్బులు లేక ఫీజుల కోసం తన బెంజ్ కార్ అమ్ముకున్నారు అంటూ ఆ ప్రచారాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేశారు . ఇప్పుడు ఆ మాటలను బద్దలు కొడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రిలీజ్ అయిన రోజుల వ్యవధిలోనే కోట్లకు కోట్లు అఫిషియల్ గా తన బ్యాంకుల్లో , కుటుంబ సభ్యుల బ్యాంకుల్లో డిపాజిట్ లు చేశారు. దీనితో మీడియాలో మరొకసారి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొనే చంద్రబాబు కు సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్, టీడీపీ నాయకులు ఇప్పటికైనా బయటకు వచ్చి ఆ బ్యాంక్ డిపాజిట్ల గురించి వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో వున్న అనుమానాలు మరింత బలపడతాయి అని రాజకీయ పరిశీలకులు అభిప్రయపడుతున్నారు.