తన పార్టీ కాంగ్రెస్ గెలుపు కంటే వైసీపీ పార్టీ ఓటమే లక్ష్యంగా వారి ఓటు బ్యాంక్ చీల్చడమే పనిగా సీట్లు కేటాయింపులు చేస్తున్నారు ఏపీ కాంగ్రస్ అధ్యక్షురాలు షర్మిల. తాజాగా షర్మిల ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చి తన కుట్రపూరిత ఆలోచనలను బహిర్గతం చేసింది.
అరకు పార్లమెంట్ కు సంభందించి పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కు మొదట నుండి కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వంతల సుబ్బారావును ప్రకటించి తరువాత వైసీపీ నుండి వచ్చిన బుల్లిబాబుకు టికెట్ కేటాయించారు షర్మిల. దీనితో వంతల సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటిలో నిలబడ్డారు. దీనితో సుబ్బారావుకు ఫోన్ చేసిన షర్మిల నామినేషన్ వెనక్కి తీసుకొమని కోరారు. షర్మిల మాట్లాడుతూ మీరు నాకు అన్న లాంటి వారు ఇప్పటికైనా నామినేషన్ వెనక్కి తీసుకోండి అంటూ మీరు నా మీద , బుల్లిబాబు మీద ఆరోపణలు చెయ్యడం బాగాలేదు , నేను డబ్బులు తీసుకోని టికెట్ కేటాయిస్తున్న అని ప్రచారం చెయ్యడం తప్పు అంటూ మాట్లాడారు. దీనికి సుబ్బారావు మాట్లాడుతూ మేడమ్ మీరు నన్ను నమ్మించి మోశారు , పార్టీ జెండా జీవితంలో ఒక్కసారి కూడా పట్టుకోని వాడికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ తన అవేదన వెళ్ళబుచ్చుతూ, మేడమ్ నేను ఈ రోజు వరకు మీ గురించి గానీ మీరు టికెట్ ఇచ్చిన బల్లిబాబు గురించి ఎక్కడ మాట్లాడింది లేదు కనీసం నా ప్రచారంలో మీ గురించి తలచింది లేదు అంటూ సమధానం ఇచ్చారు.
అయితే షర్మిల తిరిగి చెబుతూ నేను చేసింది మన కాంగ్రెస్ గురించి కాదు అన్న వైసీపీ ఓట్లు చీల్చడం కోసమే బుల్లిబాబుకు టికెట్ ఇచ్చాను అర్థం చేసుకోండి . అలాగే మీరు రెబల్ గా పోటి చేస్తే కాంగ్రెస్ పార్టీలో మీకు భవిష్యత్తు వుండదు అంటూ కఠినంగా చెప్పారు. దీనికి సుబ్బారావు మాట్లాడుతూ మీరు నా భవిష్యత్తును ఎప్పుడో నాశనం చేసారు అంటూ తన భాదను వెళ్లగక్కారు. ఇలా షర్మిల కేవలం వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ది చేకూర్చాలని చంద్రబాబు నాయుడి చిప్ ట్రీక్స్ లో భాగం అయ్యారు. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎంఎల్ఏ లను, ఆమంచి కృష్ణమోహన్ లాంటి వారిని చంద్రబాబు నాయుడు సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని టికెట్ కేటాయింపులు కూడా కేవలం వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ది చేకూర్చడమే ఏకైక ఎజెండాగా ఇస్తూ టీడీపీ కోసం పనిచేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.