వైయస్సార్ కుమార్తెగా ఎంతో విలువను సంపాదించుకోవాల్సిన షర్మిల తన అనాలోచిత నిర్ణయాల వలన రోజు రోజుకు తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు. తొలుత తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీని నడలేక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆమె, ఏపీ ఎన్నికలు వచ్చేసరికి ఏపీసీసీగా తెరపైకి వచ్చారు. సొంత అన్న జగన్ పైనే పసలేని ఆరోపణలు చేస్తూ కుటుంబ సమస్యలను ప్రజా సమస్యలుగా చూపే ప్రయత్నం చేసి ప్రజల మనసులు గెలుచుకోవడంలో విఫలం చెందారు. ఇదిలా […]
కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఎప్పుడూ ఆయన వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమె పై కేసు నమోదు చేశారు. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య […]
తన పార్టీ కాంగ్రెస్ గెలుపు కంటే వైసీపీ పార్టీ ఓటమే లక్ష్యంగా వారి ఓటు బ్యాంక్ చీల్చడమే పనిగా సీట్లు కేటాయింపులు చేస్తున్నారు ఏపీ కాంగ్రస్ అధ్యక్షురాలు షర్మిల. తాజాగా షర్మిల ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చి తన కుట్రపూరిత ఆలోచనలను బహిర్గతం చేసింది. అరకు పార్లమెంట్ కు సంభందించి పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కు మొదట నుండి కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వంతల సుబ్బారావును ప్రకటించి తరువాత వైసీపీ నుండి వచ్చిన […]
ఇప్పుడంటే మెగా సోదరులు ఒకరినొకరు పొగుడుకుంటూ.. కౌగలించుకుంటూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. అధికారం కోసం సహకారం అందించుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే బ్రదర్స్ మాధ్య మాటల యుద్ధాలు ఒక స్థాయిలో జరిగాయి. అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వేరుగా ఉన్నారు. ఓ సందర్భంలో చిరంజీవి తన తమ్ముడి మాటలపై ఇలా స్పందించారు. ‘ఈరోజున కాంగ్రెస్ పార్టీ హఠావో అన్నారు. మా పార్టీ నిన్న, మొన్న పుట్టింది కాదు. వంద సంవత్సరాలకు పైనే చరిత్ర కలిగింది. నేను […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటుకు పోటీ చేయబోవు మరో 9 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా 14 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 స్థానాలలో కాంగ్రెస్ 23 స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. అరకు పార్లమెంటు స్థానం నుంచి సిపిఎం, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి సిపిఐ పోటీ చేస్తున్నాయి. శ్రీకాకుళం […]
ఎన్నికలు వస్తే చాలు ఎక్కడ లేని భయం బాబును ఆవహిస్తుంటుంది. ఆ భయం తో నే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్, ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ అంటూ వరసగా ఒకేసారి పది ప్లాన్స్ వేసుకుని రెడీ గా ఉంటాడు. ఈసారి గతంలో లాగా బీజేపీ తో ఒకసారి, కాంగ్రెస్ తో ఒకసారి విడివిడిగా ఎన్నికలకు వెళ్తే వాళ్లు వెయ్యక, వీళ్లు వెయ్యక బొక్క బోర్లా పడ్డాం అని గ్రహించి […]
దేశంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని శుక్రవారం విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ రూపొందించిన మేనిఫోస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చడం గమనార్హం. 48 పేజీలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు రూ.5 […]
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రచారం సందర్బంగా చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తేమో ఎన్డీఏ కూటమితో ఉన్న, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ వారికి చెందిన హెలికాప్టర్లు వినియోగిస్తున్నాడు. ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాల కోసం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల హెలికాప్టర్లు, ఛాపర్లు వాడుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రచార కార్యక్రమాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి రాకపోకలు […]
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఈ త్రిముఖ పోరులో షర్మిల ప్రభావం కీలకంగా మారనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు ప్రధాన కారణం. దీంతో ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా 9 గ్యారంటీలతో ఏపీ ఎన్నికల బరిలోకి […]