విజయవాడలో నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులకు తన నివాసంలో బి ఫామ్ లు అందజేశాడు. టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు అందరికీ ఆహ్వానం పంపించారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవింద్ బాబు కూడా బీఫామ్ తీసుకోవడానికి విజయవాడకి వచ్చారు. కానీ ఆయనకు బి ఫామ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు అరవింద్ కు టికెట్ ఇవ్వకుండా చాలా […]
అయిదుగురు ఆశావహుల మద్య దోబూచులాడుతున్న నరసరావుపేట టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఎట్టకేలకు 2019 లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అరవింద బాబే దక్కించుకొన్నారు. టీడీపీ విడుదల చేసిన మూడో లిస్టులో చదలవాడ అరవింద బాబు పేరు ఖరారు అయ్యింది. 2019 లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి పై ముప్పై రెండు వేల పై చిలుకు ఓట్లతో ఓటమి పాలైన చదలవాడ ఆ తరువాత 2022 మార్చ్ వరకూ ప్రజా క్షేత్రంలో కనపడలేదు. ఆ తరువాత అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో […]
నరసారావుపేట అసెంబ్లీ టికెట్ విషయంలో అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు లావు శ్రీకృష్ణదేవరాయులు ఆడుతున్న ఆటలు ఓ సీనియర్ నాయకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. రోజుకో పేరు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చదవలవాడ అరవింద్బాబుకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే లావు అడ్డుపడుతూ తన సామాజికవర్గం వారికి సీటు ఇప్పించాలని చూస్తున్నారు. ఈ వ్యవహారంపై కొద్దిరోజులుగా తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అరవింద్బాబుకే టికెట్ ఇవ్వాలంటూ పాలపాడుకు చెందిన పులిమి […]
2019 ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డా. చదలవాడ అరవింద్ బాబు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. టీడీపీనుండి జారిపోయిన కార్యకర్తలను తిరిగి పార్టీ గూటికి చేర్చడానికి ఎంతో కృషి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నరసరావుపేట టీడీపీలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేశారు. దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారవుతున్నారన్న తరుణంలో అదే నరసరావుపేట సీటుపై ఇద్దరు నేతలు కన్నేశారు. వారిలో ఒకరు కడియాల రమేష్ కాగా మరొకరు నల్లబాటు […]
గత రెండేళ్లుగా నరసరావుపేట అసెంబ్లీ స్థాన టీడీపీ ఇంచార్జ్ పదవికి జరుగుతున్న మూడు ముక్కలాట గత నెల రోజుల్లో అయిదు ముక్కలాట కాగా, గడిచిన రెండు రోజుల్లో మరో ముక్క చేరింది. ఆ ముక్క పేరే జంగా కృష్ణమూర్తి. 2019 లో టీడీపీ తరుపున పేట నుండి పోటీ చేసి ఓడిపోయిన అరవింద బాబు నాటి నుండి టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండగా, దీర్ఘ కాలంగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ కడియాల వెంకటేశ్వర రావు కుటుంబం […]
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ టికెట్ పోరు తారాస్థాయికి చేరిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునని అనిపించక మానదు? . టీడీపీ ఆవిర్భావం నుండి 1999 వరకూ నరసరావుపేట టీడీపీకి పెట్టని కోటగా నిలిచింది. 1983 టీడీపీ ఆవిర్భావం నుండీ 99 వరకూ జరిగిన అయిదు శాసనసభ ఎన్నికల్లో వరసగా విజయాలు సాధిస్తూ వచ్చారు టీడీపీ నేత కోడెల శివప్రసాద్. 2004 లో వైఎస్ హవాలో కొట్టుకుపోయిన ఉద్దండుల్లో కోడెల ఒకరు. నాటి వరకూ […]