ఐపీఎల్ 2024లో భాగంగా నేడు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది . ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం, ఈ రెండు జట్లూ ఇప్పటికి 6 విజయాలు సాధించగా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు తప్పనిసరి. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
గత మ్యాచ్ లలో ఈ రెండు జట్లు కూడా ప్రత్యర్థుల జట్ల చేతిలో ఓటమి పాలయ్యాయి. దీంతో రెండు పాయింట్లు కోల్పోవడమే కాకుండా.. కీలకమైన రన్‌రేట్‌ను కోల్పోయాయి, సన్ రైజర్స్ హైదరాబాద్ సీజన్ ప్రారంభంలో దూకుడుగా ఆడి విజయాలు సాధించినా చివరకు వచ్చేసరికి ఓటములు చవి చూస్తుంది , హైదరాబాద్ ఆడిన గత 4 మ్యాచ్‌లలో 3 ఓడిపోవడం ఆందోళన కలిగించే అంశం .. లక్నో జట్టు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోంటుంది, గత మ్యాచ్ లో కేకేఆర్ తో 98 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి నెట్ రన్ రెట్ ను అధికంగా కోల్పోయింది , కాబట్టి ఆ రోజు మ్యాచ్ ఈ జట్టుకు కూడా కీలకం, వర్షం ఆటంకం లేకపోతే నేడు ఐపీఎల్ లో మరో రసవత్తర పోరు చూసే అవకాశం ఉంటుంది.
ప్లెయింగ్ ఎలెవన్ అంచనా :
సన్ రైజర్స్ హైదరాబాద్ :
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్),అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్
లక్నో సూపర్ జెయింట్స్ :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మోసీన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్ , ఆర్శిన్ కులకర్ణి