పుష్ప 2 చిత్ర బృందం పుష్ప పుష్ప అనే అనే పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ గా మారింది. కాగా ప్రస్తుతం ఈ పాటలో వేసిన స్టెప్ గురించి ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప పాటలోని హుక్ స్టెప్ ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా ఆ పోస్ట్ కి స్పందించిన వార్నర్ “ఈ స్టెప్ ఎంత బాగుందో.. ఇప్పుడు నాకు మళ్లీ పని పడింది. దీన్ని నేర్చుకోవాలి” అంటూ కామెంట్ చేసాడు. కాగా వార్నర్ కామెంట్ కి స్పందించిన అల్లు అర్జున్ ఈ స్టెప్ వేయడం చాలా సులభం. ఈసారి మనం కలిసినప్పుడు నేను మీకు నేర్పుతానని రిప్లై ఇచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు అభిమానులు కూడా కొన్ని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు పొందిన డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా హిట్ పాటలకు డాన్సులు వేస్తూ రీల్స్ చేయడం ద్వారా అభిమానులను ఆకట్టుకున్నాడు. గతంలో పుష్ప చిత్ర గీతాలకు వార్నర్ చేసిన డాన్సులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఇప్పుడు పుష్ప 2 వస్తుండడంతో ఆ చిత్ర పాటలకు వార్నర్ ఎలా డాన్స్ చేయనున్నారనే ఆసక్తి అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కాగా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.