2019 ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డా. చదలవాడ అరవింద్ బాబు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. టీడీపీనుండి జారిపోయిన కార్యకర్తలను తిరిగి పార్టీ గూటికి చేర్చడానికి ఎంతో కృషి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నరసరావుపేట టీడీపీలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేశారు. దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారవుతున్నారన్న తరుణంలో అదే నరసరావుపేట సీటుపై ఇద్దరు నేతలు కన్నేశారు. వారిలో ఒకరు కడియాల రమేష్ కాగా మరొకరు నల్లబాటు రాము. వీరిద్దరూ చంద్రబాబు సామాజిక వర్గం కావడం గమనార్హం. నరసరావుపేట అసెంబ్లీ సీటు కడియాల రమేష్ కు ఖరారు కానుందన్న వార్తలు కూడా వచ్చాయి.
కానీ ఇక్కడే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరసరావుపేట అసెంబ్లీ సీటు ఇస్తామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అట్ల చినవెంకటరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడంతో నరసరావుపేట రాజకీయాలు వేడెక్కాయి. కానీ సీటు హామీతో పార్టీ మారిన అట్ల చినవెంకటరెడ్డికి సీటు ఖరారు విషయంలో చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. చివరకు సీటును తిరిగి కడియాల అరవింద్ కే కేటాయిస్తారన్న వార్తలు జోరందుకోవడంతో అరవింద్ బాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట సీటుపై ఆశలు పెంచుకున్న అరవింద్ బాబుకు లావు శ్రీకృష్ణ దేవరాయలు శిఖండిలా అడ్డుపడ్డారు.
నరసరావుపేటలో అరవింద్ బాబును కాదని జంగా కృష్ణ మూర్తితో పోటీ చేయించాలని లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రయత్నించారు. నరసరావుపేటలో పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ బీసీ కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ యాదవనే పోటీ చేయించాలని చెప్పుకొచ్చిన లావు శ్రీ కృష్ణదేవరాయలకు జంగా కృష్ణమూర్తి షాక్ ఇచ్చాడు. తాను పోటీ చేయనని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేయడంతో మళ్ళీ యరపతినేని శ్రీనివాసరావును తెరపైకి తెచ్చారు. యరపతినేని కూడా నరసరావుపేటలో పోటీకి విముఖత చూపారు. దీంతో నరసారారవుపేట సీటు సందిగ్ధంలో పడింది. చివరకు అరవింద్ బాబుకే దక్కుతుందని అందరూ అనుకుంటున్న వేళ, లావు శ్రీ కృష్ణ దేవరాయలు కడియాల వెంకటేశ్వరరావు కోడలు కడియాల లక్ష్మి పేరును సూచించడం అరవింద్ కు ఇబ్బందికరంగా మారింది.
కడియాల లక్ష్మి వృత్తి రీత్యా డాక్టర్ కాగా ఆమె గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, గొట్టిపాటి నరససయ్య కుమార్తె. దీంతో అరవింద్ బాబు అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. కాగా టీడీపీ తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో సామాజిక వర్గ అంశమే ప్రధానంగా లావు కృష్ణ దేవరాయలు బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను అణగదొక్కుతున్నారని, గతంలో నరసరావుపేటలో తన ఓటమికి కోసం కోడెల పనిచేస్తే, ఇప్పుడేమో కుల ప్రాతిపదికన తనను అణచివేయడానికి లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్యాయం చేస్తున్నారని అరవింద్ బాబు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. మరి అరవింద్ బాబుకు న్యాయం జరుగుతుందో మరికొన్ని రోజులు లేదో వేచి చూడాలి?