విజయవాడలో నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులకు తన నివాసంలో బి ఫామ్ లు అందజేశాడు. టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు అందరికీ ఆహ్వానం పంపించారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవింద్ బాబు కూడా బీఫామ్ తీసుకోవడానికి విజయవాడకి వచ్చారు. కానీ ఆయనకు బి ఫామ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ముందు అరవింద్ కు టికెట్ ఇవ్వకుండా చాలా రకాలుగా టీడీపీ ఇబ్బందులకు గురిచేసింది. చివరికి చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ ఇవ్వకపోయేసరికి టీడీపీ అధికారం ఉన్న సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు టీడీపీ తీసుకెళ్లింది. అరవింద్ బాబు అభ్యర్థిత్వం మొదట ఖరారు చేయకపోయినా, వేరే ఇతర నాయకులకి టికెట్ ఇవ్వాలని ప్రయత్నించి సర్వేలలో అనుకూలంగా రాకపోయేసరికి చివరికి అరవింద్ బాబుకి టికెట్ కేటాయించారు.
అరవింద్ బాబుకు టికెట్ ఖరారు అయిన తర్వాత నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేసుకుంటున్న సందర్భంలో టీడీపీ ఆఫీస్ నుంచి బీఫామ్ ఇస్తామంటూ పిలుపు వచ్చింది. బీఫామ్ తీసుకోవడానికి వెళ్లిన అరవింద్ బాబుకు మిగిలిన 23 కోట్లు డిపాజిట్ చేసి బి ఫామ్ తీసుకెళ్లమనేసరికి ఒక్కసారిగా అరవింద్ బాబు షాక్ కి గురయ్యాడు. నరసరావుపేట టీడీపీ నాయకుల సమాచారం వరకు ఇప్పటివరకు అరవింద్ బాబు ఎలక్షన్ల కోసం 12 కోట్ల మేర డబ్బుని సమకూర్చుకున్నట్లు మిగిలిన డబ్బుని త్వరలోనే సమకూరుస్తారనే మాట మీద టికెట్ కేటాయింపు జరిగినట్లు పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. కానీ టీడీపీ అధిష్టానం 23 కోట్లు నరసరావుపేటలో ఒక నాయకుడు దగ్గరికి చేర్చి బీఫామ్ తీసుకొని వెళ్లమనేసరికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అరవింద్ బాబు ఉన్నట్లు సమాచారం.
ఇలా డబ్బు సమకూర్చమని కోరడానికి ప్రధానమైన కారణం నరసరావుపేట ఆర్యవైశ్య సమాజానికి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల కోసం తనకి టికెట్ ఇస్తే 50 కోట్లు అయినా ఖర్చు చేస్తా అనే విషయాన్ని టిడిపి అధిష్టానానికి తెలియజేయడమే కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు మిగిలిన 23 కోట్లు సమకూర్చి అరవిందబాబు టికెట్ తీసుకుంటాడా లేక సమకూర్చలేక టికెట్ వదిలేసుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా అరవింద్ బాబు కి వరుస అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ బాబు అనుచరులు బీసీ నేతకి ఇలా చేయడం సమంజసం కాదని, ఇప్పటి వరకు చేసిన అవమానాలు చాలు అని అరవింద బాబుకి బీఫామ్ ఇవ్వకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరిస్తు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.