మా కుటుంబానికి సీఎ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల మంచి జరిగిందని ఎవరైనా చెబితే అంతే సంగతి. తెలుగుదేశం, జనసేన, వాళ్ల సోషల్ మీడియా, ఎల్లో మీడియా పనిగట్టుకుని చెప్పిన వారిని రోడ్డుకు లాగేంత వరకు నిద్రపోవడం లేదు. ఏ మాత్రం కనికరం లేకుండా వారిపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఇలా చేయడం నీచమని తెలిసినా ఎల్లో గ్యాంగ్ రెచ్చిపోతోంది. పేదల కడుపు కొడుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులరైన కుమారి ఆంటీ విషయంలో ఇదే జరిగింది.
దాసరి కుమారి (కుమారి ఆంటీ) ఏపీకి చెందిన ఈమె హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో కొన్నేళ్లుగా చిన్నపాటి ఫుడ్ కోర్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఫుడ్ బ్లాగర్స్ వల్ల ఆమె సోషల్ మీడియాలో బాగా పాపులయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పెట్టడం మొదలైంది. సినిమా ప్రమోషన్లకు కూడా ఆమె ఫుడ్ కోర్టు వద్దకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ సమయంలో యాంకర్ మీకు బాగా ఆస్తులున్నాయని ప్రచారం జరుగుతోందని అడ్డగా అందుకు కుమారి ఏమి లేవని, ఏపీలో జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రం ఉందని నవ్వుతూ చెప్పారు. ఇక అంతే.. ఎల్లో గ్యాంగ్‌కు కాలింది. అంత పాపులర్ అయిన మనిషి చంద్రబాబు వల్ల బాగుపడ్డానని చెప్పాలి గానీ.. వైఎస్ జగన్ ఇల్లు ఇచ్చారనడమేంది అనుకుని హైదరాబాద్‌లో ఉంటున్న టీడీపీ, జనసేన సోషల్ మీడియా రెచ్చిపోయింది. ఆమె ఫుడ్ కోర్టు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రచారానికి దిగారు. వాస్తవానికి బాగా పాపులర్ అవడంతో రద్దీ పెరిగింది. చిన్నపాటి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. దీనిని కాదనలేం. ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు సూచనలిస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. తెలుగుదేశం బాస్ కనుసైగల్లో నడిచే రేవంత్ ప్రభుత్వం ఉండటంతో పచ్చ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కుమారి ఆంటీపై కేసు నమోదు చేయించి ఆమె వ్యాపారాన్ని మూయించేశారు. దీంతో బాధితురాలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె తెలంగాణలో ఉంటున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఇల్లు వచ్చి ఉండొచ్చు. లబ్ధి పొందారు కాబట్టి ఆ విషయం చెప్పడంలో తప్పు లేదు. కానీ రోడ్డున పడేసి పైశాచిక ఆనందం పొందడం దారుణమని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సినీ హీరో సందీప్ కిషన్ స్పందించి సొంతంగా వ్యాపారం చేసి కుటుంబానికి అండగా నిలుస్తున్న కుమారి ఆంటీ అందరికీ ఆదర్శం. ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన మహిళా సాధికారత ఉదాహరణల్లో ఇది కూడా ఒకటి. నేను, నా టీం ఆమెకు సాధ్యమైనంత వరకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ట్వీట్ చేశారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు కుమారి ఆంటీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఎల్లో మాఫియా మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని ఆపలేదు. జగన్ ఇటీవల సిద్ధం సభలో పథకాల లబ్ధిదారులే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పారు. ఆయన ప్రభుత్వం నుంచి ఏదో రకంగా లబ్ధి పొందిన వారు చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా.. అధికారుల చుట్టూ తిరిగే పనిలేకుండా ఇంటి ముంగిటకు పథకాలు వచ్చి చేరుతున్నాయి. మేం లబ్ధి పొందామని చెప్పినోళ్ల పొట్ట కొట్టడం అన్యాయం. అయినా ఇలాగే ఉంటామని ఎల్లో గ్యాంగ్ భావిస్తే వారి కంటే పిచ్చిళ్లు మరొకరు ఉండరు.