ఎన్నికల లెక్కింపు పక్రియ, ఎగ్జిట్ పోల్స్, తేదీల దగ్గరకి వచ్చేసరికి తెలుగు దేశం పార్టీ క్యాడర్ డీలా పడుతుంది, ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావేమో అనే అంశం వాళ్ళ క్యాడర్ ని తీవ్రంగా కలచివేస్తుంది, టీడీపీ అనుబంధ మీడియా సంస్థలు కూడా అసహన పూరిత విశ్లేషణలు కూడా వీళ్ళను పూర్తి నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి.
దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు జూన్ 4న పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ని బహిరంగంగా ప్రకటించేందుకు సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే, ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే టీడీపీకి చెందిన ఒక వర్గం మీడియా అధికార పార్టీ నేతలు ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకి అనుకూలంగా వచ్చేలా చేసుకుంటున్నారు, రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరు సర్వే సంస్థల నిర్వాహకులను కూడా వారు సంప్రదించినట్లు, ఇందులో ఒక సర్వే సంస్థ నిర్వాహకుడు ఇప్పటికే తన డీల్ ఖరారు చేసుకొన్నట్లు వార్తలు వండి వారుస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే తెలుగు దేశం పార్టీకి ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వస్తాయని వాళ్ళకి వాళ్లే లీకులు ఇస్తున్నట్టు ఉంది, దీనితో టీడీపీ క్యాడర్ డీలా పడిపోయి నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు, మొన్నటి వరకు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని బెట్టింగ్ లు విపరీతంగా వేసిన తెలుగు తమ్ములు ఈ వార్తలు నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్నారు, ఇంత టఫ్ గా జరిగిన ఎన్నికల్లలో ఏదైనా సంస్థ తన ప్రిడిక్షన్ ను పక్కాగా ఇస్తే ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఇంకా బాగా పెరుగుతుంది కానీ బేరసారాలకి లొంగి ఆ సంస్థ విశ్వసనీయతను ఎందుకు పోగొట్టుకుంటారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి, ఏదిఏమైనా ఈ వర్గం మీడియా అసహనం చూస్తుంటే టీడీపీ కూటమి అధికారంలోకి రాదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది.