గతంలో పచ్చని పంట పొలాలతో అలరారిన పల్నాడు జూలకంటి బ్రహ్మారెడ్డి హయాంలో ఫ్యాక్షన్ ముఠా కక్షలకు అడ్డాగా మారింది. ప్రజల నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషించారు. ముఖ్యంగా 1999 నుండి 2002 వరకూ పల్నాడు ప్రాంతంలో 26 మంది కేంగ్రెస్ నేతల హత్యల జరగగా ఒక్క వెల్దుర్తిలోనే 12 మంది హత్యకు గురవడం గమనించాల్సిన విషయం. ఈ 12 మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా జూలకంటిని వ్యతిరేకించిన వారే కావడం […]
ఏపీలో టీడీపీ, జనసేన , బిజెపి కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ కు సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒకరికి ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ దాడులు చేసుకుంటున్నారు. మామీద మీ పెత్తనం ఏమిటి అంటూ నాయకులు కార్యకర్తలు గొడవలు పడుతూ తన్నుకున్నారు. తాజాగా మాచర్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఉమ్మడి అభ్యర్ధి అయిన జూలకంటి బ్రహ్మరెడ్డి మాచర్ల రూరల్ మండలంలో తాళ్లపల్లిలో ప్రచారంలో తమ టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే […]
నాలుగుసార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక తెలుగుదేశం నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పైకి గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయన అండతో శ్రేణులు చీప్ ట్రిక్స్‌కు దిగాయి. 2019లో రామకృష్ణారెడ్డికి 1,10,406 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డికి 88,488 ఓట్లు వచ్చాయి. పిన్నెల్లి 21,918 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఈ […]
జూలకంటి బ్రహ్మానందరెడ్డి అలియాస్ బ్రహ్మారెడ్డి. ఈ మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. రౌడీ, హత్యా రాజకీయాలకు అతను పెట్టింది పేరు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తూ శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యాడు. 2021 డిసెంబర్ లో మాచర్ల టీడీపీ ఇంచార్జ్ గా ప్రకటించిన తర్వాత ఫాక్షన్ కుట్రలకు తెర లేపిన బ్రహ్మారెడ్డి ఎన్నికలు సమీపించే కొద్ది సానుభూతి కోసం చేసే చిల్లర పనులకు అంతే లేకుండా […]
మాచర్ల తెలుగుదేశం ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మా రెడ్డి అనుచరులు మరోసారి బరితెగించారు . జూలకంటిని మాచర్ల టీడీపీ ఇంచార్జ్ గా ప్రకటించిన నాటి నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా వరుస దాడులు, దొమ్మిలతో రెచ్చిపోతున్న జూలకంటి అనుచరులు ఈ రోజు మరో దౌర్జన్యానికి తెగ బడ్డారు. మాచర్ల పట్టణం 28వ వార్డులో రేపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉండటంతో ప్రతి ఇంటి ముందు జెండాలు కట్టారు. ఈ క్రమంలో వైయస్సార్ […]