ఏపీలో టీడీపీ, జనసేన , బిజెపి కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ కు సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒకరికి ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ దాడులు చేసుకుంటున్నారు. మామీద మీ పెత్తనం ఏమిటి అంటూ నాయకులు కార్యకర్తలు గొడవలు పడుతూ తన్నుకున్నారు. తాజాగా మాచర్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఉమ్మడి అభ్యర్ధి అయిన జూలకంటి బ్రహ్మరెడ్డి మాచర్ల రూరల్ మండలంలో తాళ్లపల్లిలో ప్రచారంలో తమ టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇదే సమయంలో జన సేన తరుపున అ మండల వీర మహిళా అధ్యక్షురాలు, మండల కన్వీనర్ గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. ఇది చూసి జూలకంటి బ్రహ్మరెడ్డి వర్గీయులు కోపంతో రగిలిపోతూ వారిని అడ్డుకున్నారు.
మీ ప్రచార రధాన్ని అపాలి లేదా మా వెనక రావాలి, మేమొచ్చినప్పుడే మీరు విడిగా ప్రచారం చేసేదేందీ , అసలు ఒక్క ఓటు కూడా వేయించలేని మీరు మా టీడీపీకి ప్రచారం చేయ్యడం ఏమిటి, మా మీద మీ బోడి పెత్తనం ఏమిటి అంటూ ఒక్కసారిగా జన సేన నాయకుల మీద దాడులకు పాల్పడ్డారు. అదే సమయంలో జన సేన నాయకులు మాట్లాడుతూ మొన్నటి వరకు నీ వెనుక వున్నవారు వైసీపీలో వుండి ఈరోజు తమ స్వార్థం కోసం నీ వెనుక టీడీపీలోకి వచ్చి ఇక్కడ పెత్తనం చెయ్యాలని చూస్తే ఉరుకోము అని మాటకు మాట బదులు ఇచ్చారు. దీనితో టీడీపీ కార్యకర్తలు జూలకంటి బ్రహ్మరెడ్డి వర్గీయులు జన సేన ప్రచారం లో వున్న వారిపై దాడులు చేశారు. వెంటనే తిరగబడ్డ జన సేన నాయకులు తమ మీద టీడీపీ నాయకుల కొట్లాట ను అడ్డుకుంటూ ఒకరి మీద ఒకరు పిడి గుద్దులు గుద్దుకుంటు కొద్ది సేపు యుద్ద వాతావరణం సృష్టించారు. ఈ గొడవల్లో జన సేన కన్వీనర్ కు దెబ్బలు తగిలాయి. ఈ గొడవతో ఒక్కసారిగా తాళ్లపల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ గొడవలను చూసిన గ్రామ ప్రజలు ఈ రెండు పార్టీల నాయకులను చూసి చిదరించుకున్నరు.
ఇప్పుడు అదే విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. కూటమిగా ఏర్పడి కలిసి ప్రచారమే చెయ్యలేని వారు రేపొద్దున ప్రజలకు ఏమి మంచి చేస్తారు అంటూ నియోజకవర్గం అంతటా చర్చించు కుంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే దీనిమీద ఇప్పటి వరకూ ఎవరూ పోలీస్ ఫిర్యాదు చెయ్యకపోవడం.