2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాగా హడావిడి చేసిన కాపు సంక్షేమ అధ్యక్షుడు మాజీ మంత్రి హరి రామ జోగయ్య ప్రస్తుతం ఎక్కడా కనబడడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ కి పలు సలహాలు ఇస్తూ లేఖలు రాసిన హరే రామ జోగయ్య ఎక్కడ కనబడక పోయేసరికి , ఎక్కిడికి వెళ్లిపోయాడు అంటూ ప్రశ్నలు పలువురి నుండి ఉత్పన్నం అవుతున్నాయి . టీడీపీ జనసేన పొత్తు అని ప్రకటించిన దగ్గర నుంచీ ఆయన పవన్ కళ్యాణ్ […]
పాపం.. హరిరామజోగయ్య.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకుని నిండా మునిగిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రస్తుతం కాపు నేతల ఆవేదన ఇది. తన సామాజికవర్గాన్ని రాజ్యాధికారం దిశగా నడిపించేందుకు ఆ పెద్దాయన చేసిన ప్రయత్నాలు నీరుగారిపోవడంతో కాపు సంక్షేమ సేనను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం లేఖ విడుదల చేశారు. ఇదీ జరిగింది.. తెలుగుదేశం – జనసేన పొత్తులో పవన్ కీలక పాత్ర పోషించాలి. 50 నుంచి […]
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మరో లేఖ రాశారు. ఇటీవల మంగళగిరిలో చంద్రబాబు జయహో బీసీ అనే సభను నిర్వహించారు. ఇందులో సేనాని కూడా పాల్గొన్నారు. ఉభయ పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ పేరుతో పది ఎన్నికల హామీలిచ్చాయి. పవన్ 11వ హామీగా రాజ్యాధికారం కోసం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెస్తానంటూ బీసీలకు చెప్పారు. ఇందుకు జోగయ్య కాపు డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారంటూ లేఖ […]
మంచో చెడో తనకున్న వాటిల్లో ముఖ్యాశయం తన కులాన్ని ఉద్ధరించడమే అని సందర్బం వచ్చినపుడల్లా ఒప్పుకుంటారు హరిరామజోగయ్య. అపార రాజకీయానుభవం, పలు పార్టీలలో పని చేసిన నేర్పరితనం అన్నిటి కన్నా ముఖ్యంగా వంగవీటి హత్య సమయంలో బాబు రాజకీయాలను అతి దగ్గరగా చూసిన వైనం(ఆయన ఆత్మకథ లోనే చెప్పారు) ఇవన్నీ కలిపి ఈ రాజకీయ కురువృద్ధుడికి ప్రత్యేకమైన దృక్కోణం వచ్చేలా చేసాయి. వృద్ధాప్యం వల్ల పాలకొల్లు వంటి ఊరు దాటి బయటకు రాలేక పోయినా, రాష్ట్ర రాజకీయాల […]
టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించిన విషయం విదితమే. పొత్తులో భాగంగా జనసేనకు24 సీట్లు ప్రకటించిన తర్వాత మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్ హరిరామ జోగయ్య స్పందిస్తూ కాపులకు ఇంకెప్పుడు రాజ్యాధికారం దక్కేది అని సూటిగా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాడు. అసలు ఈ సీట్ల పంపకం తెలుగుదేశం యివ్వటం, చేయి జాచి జనసేన తీసుకోవటం ఏమిటి? జనసేన పార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా? […]