2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాగా హడావిడి చేసిన కాపు సంక్షేమ అధ్యక్షుడు మాజీ మంత్రి హరి రామ జోగయ్య ప్రస్తుతం ఎక్కడా కనబడడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ కి పలు సలహాలు ఇస్తూ లేఖలు రాసిన హరే రామ జోగయ్య ఎక్కడ కనబడక పోయేసరికి , ఎక్కిడికి వెళ్లిపోయాడు అంటూ ప్రశ్నలు పలువురి నుండి ఉత్పన్నం అవుతున్నాయి . టీడీపీ జనసేన పొత్తు అని ప్రకటించిన దగ్గర నుంచీ ఆయన పవన్ కళ్యాణ్ కు లేఖలు రూపంలో ఏదో విధమైన సలహాలు ఇస్తూనే ఉన్నారు.
మొదటగా బాబుని నమ్మద్దని, పొత్తు అంటే అధికారంలో వాటా ఉంటుందా అంటూ, కాపులకు ఎన్ని సముచిత సీట్లు ఇస్తారూ అంటూ ఆరా తీసి, కాపుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టొద్దు అంటూ పవన్‌కు ఎప్పటికి అప్పుడు హెచ్చరికలు చేస్తూ అన్నిరకాలుగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. కూటమిలో భాగంగా జనసేనకు 21 సీట్లే ఇచ్చినపుడు షాక్‌కు గురైన తర్వాత ఒకటి రెండుసార్లు లేఖ రాసి పూర్తిగా కనుమరుగైపోయారు. టిడిపి జనసేన బిజెపి అధికారికంగా సీట్ల పంపకాలు జరగకముందు 175 అసెంబ్లీ స్థానాలలో 60 మందితో కూడిన జాబితాను హరిరామ జోగయ్య లేఖ రూపంలో పవన్ కళ్యాణ్ కు ఇచ్చాడు, ఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి అక్కడ ఎవరిని అభ్యర్థుల్ని నిలబెట్టాలి అంటూ ఒక జాబితా ఇస్తే అది పవన్ కళ్యాణ్ కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు.
కూటమిలో 60 కాకపోయినా 40 సీట్లు తీసుకున్న కనీస గౌరవం ఉంటుంది అని చెప్పిన పవన్ జోగయ్య మాటలను గాలికి వదిలేశాడు. పొత్తులో భాగంగా మొదట 24 సీట్లు తీసుకున్నప్పుడు కంగుతున్న జోగయ్య తర్వాత రెండు లేఖలు రాసి ఆపేశాడు. ఇప్పుడు కనీసం హరి రామయ్య ఎక్కడున్నాడో కూడా కనిపించడం లేదు, కాపు సంక్షేమ కోసం తాను ఇస్తున్న సలహాలు పట్టించకపోవడంతో సలహాలు ఇవ్వడం అనవసరం అని భావించి ఎవరికి అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయాడు జోగయ్య .