ఈనెల 13వ తారీకున ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో అందరికీ తెలిసిందే… ఎన్నికల్లో అధికార వ్యాసర కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి టిడిపి జనసేన కూటమి గా పోటీలో నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థులు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నేటికి సరిగ్గా ఆరు రోజులు మాత్రమే ఉండగా ఏ టెన్షన్ లేదు, వార్ వన్ సైడే, గెలిచేది మేము అంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఒకపక్క గెలుపుపై వైఎస్ఆర్ సీపీ ధీమాగా ఉంటే మరొక పక్క టీడీపీ మాత్రం తమకు అలవాటైన బాగా వ్యవస్థల మేనేజ్మెంట్లో మునిగిపోయింది.
ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న వేళ జాతీయ సర్వేలు, ప్రాంతీయ సర్వేలు అన్నీ వైఎస్ఆర్ సీపీదే గెలుపని ప్రకటించాయి. పోలింగ్ తరువాత రెండు మూడు రోజులు హడావుడి చేసిన టీడీపీ, ఎల్లో మీడియా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల అనంతరం గెలుపు మాదే అంటూ హడావుడి చేసిన శ్రేణులు ప్రస్తుతం మిన్నకుండిపోయాయి. వైఎస్ఆర్ సీపీ శ్రేణులు మాత్రం గెలుపు తమదేననే విజయోత్సాహంలో ఉరకలు వేస్తున్నాయి. జూన్ 9న సీఎంగా రెండోసారి తమ నాయకుడు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఫలితాలు తరువాత విశాఖ చేరుకోవడానికి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే పోస్టల్ బ్యాలెట్లో గడబిడ చేయడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి బాబు కూటమి స్కెచ్ వేస్తుంది. ఈసీ కూడా ఎల్లో కూటమిలో చేరి నిబంధనలు అతిక్రమించడం బాధాకరం. 50 శాతం ఓట్లతో.. 150కిపైగా ఎమ్మెల్యే..
20కిపైగా ఎంపీ సీట్లు తమకు వస్తాయని వైఎస్ఆర్ సీపీ నేతలు ధైర్యంగా చెబుతుంటే ఎన్ని సీట్లు గెలుస్తారో కూడా చెప్పలేని స్థితిలో కూటమి నేతలున్నారు. పురందేశ్వరి, షర్మిల ఎక్కడున్నారో కూడా తెలియదు. బాబు, పవన్, లోకేష్.. ఏ దేశం వెళ్లారో తెలియదు. జగన్ మాత్రం లండన్ వెళ్లారు. ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు జగరకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3, 4, 5 తేదీల్లో మద్యం విక్రయాలు కూడా నిషేధించారు. మరొకపక్క జూన్ 4న ఊరేగింపులపై నిషేధం ఉంది.
మాచర్లలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని పల్నాడుపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలీసు శాఖ పల్నాడు జిల్లాపై ప్రత్యేకంగా చర్చించి భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే కేంద్రం నుంచి ప్రత్యేక భద్రతాబలగాలు దిగాయి. అయితే ప్రజలు తమను తిరస్కరించారని బాబు కూటమి ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అందుకే… పరువు నిలబెట్టుకునేలా గెలవాలనే కుటిల వ్యూహంలో భాగంగానే ఈసీని వాడుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, వైఎస్ఆర్ సీపీ మాత్రం ప్రజలు తమ వైపే ఉన్నారని, తమకు 50 శాతానికిపైగా పాజిటివ్ ఓటు పడిందని, అన్ని వర్గాల వారు తమను ఆదరించారని, గెలుపు తమదేనని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.