ఎన్నికల లెక్కింపు పక్రియ, ఎగ్జిట్ పోల్స్, తేదీల దగ్గరకి వచ్చేసరికి తెలుగు దేశం పార్టీ క్యాడర్ డీలా పడుతుంది, ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావేమో అనే అంశం వాళ్ళ క్యాడర్ ని తీవ్రంగా కలచివేస్తుంది, టీడీపీ అనుబంధ మీడియా సంస్థలు కూడా అసహన పూరిత విశ్లేషణలు కూడా వీళ్ళను పూర్తి నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు జూన్ 4న పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ని […]
ఈనెల 13వ తారీకున ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో అందరికీ తెలిసిందే… ఎన్నికల్లో అధికార వ్యాసర కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి టిడిపి జనసేన కూటమి గా పోటీలో నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థులు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నేటికి సరిగ్గా ఆరు రోజులు మాత్రమే ఉండగా ఏ టెన్షన్ లేదు, వార్ వన్ సైడే, గెలిచేది […]
భవిష్యత్ టీడీపీ రథసారథిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికి అగమ్యగోచరంగానే ఉంది. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దకాలం కావస్తున్నా ఇప్పటికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ప్రజల మద్దతతుతో చట్ట సభలకి వెళ్ళకుండా తండ్రి చాటున శాసన సభలో దూరిన వ్యక్తిగా ఇప్పటికి హేళన ఎదుర్కుంటున్న నారాలోకేష్ ఈసారైనా ప్రజామద్దతుతో చట్ట సభల్లోకి వస్తారా అనే మీమాంసలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. దీనికి కారణం నారాలోకేష్ ఎంచుకున్న నియోజకవర్గం మంగళగిరి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీ అధికారం చేబట్టబోతుంది అనే అంశాలపైనే ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా తీవ్రమైన చర్చ నడుస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అధికశాతం పోలింగ్ ఏపీలో జరిగిందంటేనే ఏపీ ప్రజలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతుంది. జగన్ పై చంద్రబాబు అనుకూల మీడియాగా తాము చేసిన ప్రచారాన్ని నమ్మి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని […]
పార్టీల హోరాహోరీ ప్రచారాలు, ఓటర్లకి తాయిలాలు, ఎన్నికల దౌర్జన్యాలు లాంటి కార్యక్రమాలతో ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉండటంతో గెలుపోటములపై ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సంక్షేమ పాలన ద్వార తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంటే, తెలుగుదేశం నాయకత్వానికి మాత్రం పైకి తాము అధికారంలోకి వస్తాం అని చెబుతున్నా వారి మనసుల్లో […]
భారతరాజ్యంగంలో కేసు తీవ్రతను బట్టి ఒక్కో రకమైన నేరానికి ఒక్కో విధమైన శిక్షా దానికి అనుగణంగానే సెక్షన్లు ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి మాత్రం సెక్షన్లు బట్టి కేసు తీవ్రత కాకుండా , వ్యక్తులని బట్టి ఆ తీవ్రతను డిసైడ్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎల్లో మీడియాగా పిలవబడే తెలుగుదేశం అనుకూల మీడియా ఈ పద్దతిని తూచా తప్పకండా పాటిస్తుంది. తమకి నచ్చని వ్యక్తులకి సంబంధించిన తీవ్రమైన కేసులని పలుచన చేసే విధంగా పత్రికల్లో […]
వెన్నుపోట్లే రాజకీయ మెట్లుగా మార్చుకుని ఎదిగిన చంద్రబాబు మరోసారి తన మార్క్ వెన్నుపోటుకు సిద్దమైనట్టు ఆ పార్టీ వారు పెడుతున్న ప్రెస్ మీట్లు చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ సారి ఆయన పొడవబోయే పోటు ఆ పార్టీ సీనియర్ బీసీ నేత అచ్చం నాయుడకే వాదన వినిపిస్తుంది. ఉత్తరాంధ్రలో రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అచ్చం నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షులుగా భాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ భాధ్యతల నుండి ఆయనను తప్పించేలా […]
ఈనెల 13వ తేదీన ముగిసిన ఎన్నికల అనంతరం చంద్రబాబు కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్న ప్రకారమే సతీ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే ఎప్పుడు ఏ పర్యటన చేసిన అధికారికంగా వెల్లడించే టిడిపి వర్గాలు ఈ పర్యటనను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచటం సర్వత్ర చర్చనీయాంసంగా మారింది. రహస్యంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని ఇప్పటికే ఆరాలు తీయడం మొదలైంది. అయితే చంద్రబాబు తాను వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం ముగిసినా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్ సరళి సర్వే సంస్ధలతో పాటు పేరెన్నికగన్న సెఫాలజిస్టులకు కూడా అంతుచిక్కడం లేదు. ఓవైపు కూటమికే విజయావకాశాలు ఉన్నాయని ఎల్లో మీడియా & టీడీపీ అనుకూల ఛానెళ్లు ఊదరగొడుతున్నాయి. మరోవైపు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా 2019 ఎన్నికలకు మించి ఘన విజయాన్ని సాధిస్తుందని స్పష్టం చేయడంతో ఆంధ్రప్రదేశ్ […]
టీడీపీ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఇలా పలు అవినీతి కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినట్టు చంద్ర బాబు ఆస్థాన పత్రికగా ముద్ర పడిన ఒక ప్రముఖ పత్రిక న్యూస్ ని ముద్రించింది అయితే ఆ న్యూస్ ని టీడీపీ ఎన్నారై విభాగం ఇంఛార్జి తప్పుడు న్యూస్ గా కొట్టిపారేయడంతో […]