2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలోని 175 నియో జకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తామని అయన మీడియాకి వెల్లడించారు.
సమస్యాత్మక జిల్లాల్లో లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ ను అమలుచేసి, సీనియర్ పోలీసు అధికారులను నియమిస్తాం. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ప్రత్యేకదృష్టి పెడతాం. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించాం. అధికారులను అప్రమత్తం చేశామని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ గారి సమీక్షలో ఆయన తెలిపారు.
మొత్తం 175 నియోజకవర్గాలకు 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 కు పైగా రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, సీపీ, ఎస్పీలను అప్రమత్తం చేశామని మీనా పేర్కొన్నారు. ఇంకో పక్క కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశా మని రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు.
డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ మాట్లడుతూ, లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులే కుండా చూడాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫాం-21సి, ఫాం-21ఈ లను అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని తెలిపారు.