దేశవ్యాప్తంగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికల బరిలోకి దిగిన 324 మంది ఎంపీల ఆస్తుల్లో గత ఐదేళ్లలో పోల్చితే సగటున 43% పెరుగుదల నమోదైందని పోల్ రైట్స్ బాడీ సంస్థ వెల్లడీంధింది. 2019లో ఈ ఎంపీల సగటు ఆస్తులు దాదాపు 21.55 కోట్లు కాగా, ప్రస్తుత ఎన్నికల్లో అవి సగటు ఆస్తి విలువ30.88 కోట్లకు గణనీయంగా పెరిగిందని, ఇది గత ఐదేళ్లలో 9.33 కోట్ల పెరుగుదలను సూచిస్తుందని అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తున్న పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) ఆర్థిక వృద్ధిని ఇది విశ్లేషించింది.హవితవ్యం ఏడు దశలలో జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేలనున్న విషయం తెలిసిందే. అయితే 2019 మరియు 2024 ఎన్నికల మధ్య తిరిగి ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది ఎంపీల ఆస్తుల్లో వృద్ధి శాతం సగటున 43 శాతంగా నమోదైందని ఏడీఆర్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ విశ్లేషణ ద్వారా 2019-2024 మధ్య పార్టీల వారీగా సగటు ఆస్తుల పెరుగుదల చూస్తే, ప్రధాన పార్టీలలో, భారతీయ జనతా పార్టీ తిరిగి పోటీ చేసిన 183 మంది ఎంపీల ( 18.40 కోట్ల నుంచి 25.61 కోట్లుగా) సగటు ఆస్తుల్లో 39.18 శాతం వృద్ధిని కనబరిచింది. అలాగే 36 మంది కాంగ్రెస్ ఎంపీలకు ఇది 48.76 శాతం ( 44.13 కోట్ల నుంచి 65.64 కోట్లుగా) ఉంది.
ఇక ద్రవిడ మున్నేట్ర కజగంకు చెందిన 10 మంది ఎంపీలను తిరిగి పోటీ చేఅస్తే 19.96 శాతం (30.93 కోట్ల నుంచి 37.10 కోట్లుగా), ఎనిమిది మంది శివసేన ఎంపీలకు 48.13 శాతం (19.77 కోట్ల నుంచి 29.28 కోట్లుగా), ఐదు సమాజ్‌వాదీకి ఎంపీలకు 20.53 శాతం. (20.56 కోట్ల నుంచి 24.78 కోట్లుగా), ఎనిమిది మంది వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు 84.13 శాతం (28.66 కోట్ల నుంచి 52.78 కోట్లుగా). తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 16 మంది మళ్లీ పోటీ చేసిన ఎంపీల ఆస్తుల సగటు పెరుగుదల 53.84 శాతం ( 15.69 కోట్ల నుంచి 24.15 కోట్లు), 11 మంది జనతాదళ్ (యునైటెడ్) ఎంపీల ఆస్తుల్లో సగటు పెరుగుదల 35.54 శాతం ( 4.55 కోట్ల నుంచి 6.17 కోట్లుగా), ఒక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి 14.34 శాతం (12 కోట్ల నుంచి 14 కోట్లుగా), ముగ్గురు భారత రాష్ట్ర సమితి ఎంపీలకు 52.94 శాతం (38 కోట్ల నుంచి 59 కోట్లు), ముగ్గురు ఎన్సీపీకి ఎంపీలు 21.05 శాతం ( 48 కోట్ల నుంచి 58 కోట్లు), ఒక జనతాదళ్ (సెక్యులర్) ఎంపీకి 317 శాతం ( 9 కోట్ల నుంచి 40 కొట్లుగా) ఉన్నాయి.
అలాగే బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీలు 25.37 శాతం ( 8.46 కోట్ల నుంచి 10.61 కోట్లు), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)కి 68.4 శాతం (7.01 కోట్ల నుంచి 11.80 కోట్లు). బిజూ జనతాదళ్ (2.41 కోట్ల నుంచి 6.85 కోట్లు), తెలుగుదేశం పార్టీకి 143.2 శాతం (18.90 కోట్ల నుంచి 45.97 కోట్లు), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు 104.9 శాతం (13.07 కోట్ల నుంచి 26.78 కోట్లు) సిక్కిం క్రాంతికారి మోర్చాకు ( 4,78 లక్షల నుంచి 1.48 కోట్లు) అని నివేదిక పేర్కొంది. ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ( 10.43 కోట్ల నుంచి 14.09 కోట్లు), భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)కి 97.61 శాతం ( 85.40 లక్షల నుంచి 85.40 లక్షల నుంచి 10.43 కోట్ల వరకు) ఇక విడుతలై చిరుతైగల్ కట్చికి 117.36 శాతంగా ఉంది, శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) తిరిగి పోటీ చేస్తున్న ఎంపీల ఆస్తులు మూడు శాతం స్వల్పంగా తగ్గాయని నివేదిక పేర్కొంది