దాదాపుగా 15 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు చూశాడు జగన్. ఎన్నో కష్టాలను నష్టాలను భరిస్తూ ఎన్నో అవమానాలకు ఎదురీదుకుంటూ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. ఆయన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత జగన్ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే పేద ప్రజల కోసం తన తండ్రి ఒక అడుగు వేస్తే, తాను రెండు అడుగులు వేస్తానంటూ ముందుకు సాగాడు. అనుకున్నది తడవగా కష్టాలు ఎదురవుతాయి అని తెలిసినా సరే ఎదిరించి నిలబడ్డారు.
నల్లకాలువ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంకల్పయాత్రతో పాదయాత్రగా ప్రతి గడపను తాకిన జగన్ కొన్ని కోట్ల మంది ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ తాను వస్తే ఏం చేస్తాడో చెబుతూ ప్రజల మనసు గెలుచుకున్నాడు. తన సుదీర్ఘ పాదయాత్రలో మానిఫెస్టోను ఒక బైబిల్ గా ఖురాన్ గా భగవద్గీతగా భావిస్తానని ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్ర ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపుగా 90 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడిగా చరిత్ర సృష్టించారు.
చెడిపోయిన వ్యవస్ధలతో విలువలు లేని ఒక వర్గ మీడియాతో మనం పోరాడుతున్నాం. దానికి నా ఒక్కడి పోరాటమే సరిపోదు.. మీ అందరి సహకారం కావాలంటూ జగన్ జనానికి పిలుపునిస్తే ఆ పిలుపు ఒక ప్రభంజనమై చరిత్రలో నిలిచిపోయే ఒక సంచలన విజయంగా మారింది. భారతదేశ రాజకీయ చరిత్రలో మునిపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారి, 23 పార్లమెంట్, 151 అసెంబ్లీ సీట్లతో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే అఖండ విజయాన్ని అందించింది. ప్రజల మన్ననలు పొంది వారి సంక్షేమ అభివృద్ధికి శతవిధాల కృషి చేసిన ప్రజా ప్రభుత్వం పాలనకు అడుగులు పడి, నేటికి సరిగ్గా ఐదేళ్లు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన దీవెనతో మరో ఐదేళ్ల సుభిక్షమైన పాలనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.