జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు దేశం మొత్తంలో వేరే ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేవు.. సచివాలయ వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్నే మార్చిన సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న గీతను చెరిపేసారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాడు నేడుతో ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు సత్తా చాటాలని వారికి ట్యాబులను అందించారు. నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను సమూలంగా మార్చివేశారు. జగన్ ప్రభుత్వ పనితీరును, సీఎం జగన్ పరిపాలనలో చూపిస్తున్న చిత్తశుద్ధిని దేశం మొత్తం కీర్తిస్తున్నా, నేషనల్ మీడియా జగన్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పాలనను మెచ్చుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓ రాజకీయ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్న ఓ వర్గం మీడియాకు మాత్రం పెన్ను పెగలడం లేదు.
ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా మార్చేందుకు ఇప్పటికే సుమారు 20000కోట్ల పెట్టుబడులతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేస్తుండగా, కాకినాడ గేట్వే పోర్టును పీపీపీ విధానంలో జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. జగన్ చేస్తున్న ఈ అభివృద్ధి నేషనల్ మీడియాకు కనబడుతుంది కానీ ఒక పార్టీ పంచన చేరి కళ్ళు మూసుకుపోయిన స్థానిక మీడియాకి మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే పోర్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణం పూర్తైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించనుంది.
వాస్తవానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ, పాలనలో జగన్ చూపిస్తున్న చిత్తశుద్ధి, పారదర్శకతను ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. కానీ స్థానిక మీడియా ఓ రాజకీయ పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తూ సీఎం జగన్ పై విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. జగన్ ప్రభుత్వ పనితీరుపై బురదజల్లడం అబద్దాలతో కూడిన కథనాలను ప్రచారం చేయడం, అవాస్తవాలను ప్రచురిస్తూ ప్రజలను ఏమార్చాలని స్థానిక మీడియా ప్రయత్నం చేస్తుంది. ఈ మీడియా ఎంతగా దిగజారిపోయిందో ఈ కింది ఉదాహరణ చూస్తే తెలిసిపోతుంది. ప్రభుత్వ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న కొందరు బాలురు హాస్టల్ నుండి బయటకు వెళ్లి మద్యం సేవిస్తూ స్థానికులకు కనబడ్డారు. ఈ సంఘటనపై సంబంధిత వార్డెన్ ను, ఆ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ నిలదీయాలి. కానీ ఓ వర్గం మీడియా ముఖ్యమంత్రి జగన్ కు ఆ సంఘటనను ముడిపెడుతూ వార్తలు వండి వార్చింది. విద్యార్థుల అభివృద్ధి ప్రభుత్వం ట్యాబులు ఇస్తే దానిపై కూడా విషప్రచారం చేసింది సదరు మీడియా. ఇలా జర్నలిజం విలువలని దిగజార్చి సీఎం జగన్ కి వ్యతిరేకంగా కథనాలను వండి వారుస్తున్న సదరు మీడియాకు ప్రజలంతా బుద్ది చెప్పే రోజు త్వరలోనే రానుంది.