రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే పచ్చ మంద చూడలేకపోతోంది. ప్రజల్ని చూడకుండా చేసేందుకు ఆట్.. మా చంద్రబాబు నాయుడు ఏమైపోవాలని ఆందోళన చెందుతూ దుష్ప్రచారానికి దిగింది. పరిశ్రమల విషయంలో ఎల్లో గ్యాంగ్ చెబుతున్న అబద్ధాలు అంతే లేకుండా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక స్వయానా తన చేతుల మీదుగా పరిశ్రమలు ప్రారంభించారు. కొన్నింటికి భూమి పూజ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి.
టెక్స్టైక్స్ రంగంలో రూ.368 కోట్లతో కింబెర్లీక్లార్క్ ఇండియా (117 మందికి ఉపాధి), సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ రంగంలో రూ.43,143 కోట్లతో ఇండోసోల్ సోలార్ (11,500 మందికి ఉపాధి), ఫార్మా స్యూటికల్స్ రంగంలో రూ.1,962.64 కోట్లతో లైఫస్ ఫార్మా (2,000 మందికి ఉపాధి), లిథియం బ్యాటరీల రంగంలో రూ.124 కోట్లతో మునోత్ ఇండస్ట్రీస్ (350 మందికి ఉపాధి), పెట్రో కెమికల్స్ రంగంలో రూ.28,000 కోట్ల పెట్టుబడితో హెచ్పీసీఎల్ రిఫైనరీ విస్తరణ (3,500 మందికి ఉపాధి), అల్యూమినియం రంగంలో రూ.6,700 కోట్ల పెట్టుబడితో పయనీర్ అల్యూమినియం (2,300 మందికి ఉపాధి), ఇథనాల్ తయారీ రంగంలో రూ.85 కోట్ల పెట్టుబడితో డాల్వకోట్ బయో ఫ్యూయోల్స్ (184 మందికి ఉపాధి), హీట్ ఎక్ఛ్సేంజర్ యూనిట్ రంగంలో రూ.95.28 కోట్లతో వీఆర్వీ ఏషియా పసిఫిక్ (264 మందికి ఉపాధి), రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ రంగంలో రూ.300 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (300 మందికి ఉపాధి) ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి.
మరి వీటికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారో.. ఎన్నికల సభల్లో పరిశ్రమలు రాలేదని ఊదరగొడుతున్న ఆయన కాస్త ప్రభుత్వ గణాంకాలు తెప్పించుకుని చూస్తే బాగుంటుందని ప్రజానీకం అభిప్రాయపడుతోంది.