ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అది 2004 లో వైఎస్ఆర్ ప్రభంజనం లో మాత్రమే. అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పిల్లి మొగ్గలతో మూడు గ్రూప్ లుగా విడిపోయింది. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు టీడీపీ కార్యకర్తలలో కాక రేపుతున్నాయి .
ఉండి నియోజకవర్గం లో 2009,14 లో కలగపూడి శివరామరాజు భారీ మెజార్టీ తో గెలిచారు అయితే చంద్రబాబు 2019 లో నరసాపురం లోక్ సభకు అభ్యర్థులు దొరక్క మంచి పేరు వున్న కలగపూడి శివరామరాజును బలవంతంగా ఒప్పించి ఎంపీ గా పోటి చెయ్యమని ప్రాధేయపడ్డారు . చివరకు ఉండి అసెంబ్లికి మంతెన రామరాజు, నరసాపురం ఎంపీగా కలగపూడి శివరామరాజు పోటి చేశారు. ఎమ్మెల్యేగా మంతెన రామరాజు గెలిచారు ఎంపీగా కలగపూడి శివరామరాజు వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. ఆరోజు లోకల్ గా టీడీపీలో మంతెన రామరాజుకు కలగపూడి శివరామరాజుకు మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడిచింది.
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మంతెన రామరాజుకు టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. దీనితో కలగపూడి శివరామరాజు టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నా అని ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రచారం కూడ మొదలు పెట్టారు. టీడీపీ తరుపున మంతెన రామరాజు కూడా ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఉన్నట్టు వుండి రఘురామకృష్ణంరాజు రూపంలో మూడో రాజు ఉండిలో ప్రవేశించి చంద్రబాబు నాయుడ్ని బ్లాక్ మెయిల్ చేసి సీటు సంపాదించారు.
దీనితో ఉండి టీడీపీ ముగ్గురు రాజుల మధ్య విడిపోయి ముగ్గురి మధ్య మూడు ముక్కలట గా మారింది. కార్యకర్తలు అంతా విడిపోయి చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకంను తిట్టుకుంటూ రాష్ట్రంలో టీడీపీ మొదటి గెలిచే ఉండి నియోజకవర్గం ను మొదట ఓడిపోయ్యే నియోజవర్గంగా మార్చారు అని చెప్పుకుంటున్నారు.