నారా వారు నోరు విప్పితే అన్ని అతుకుల బొంతలమాటలే.. అర్థపర్ధం లేని కూతలే అని మరోసారి రుజువు అయింది. నిజం ఆ నోటనుండి ఆ ఇంటి నుండి ఎప్పటికీ బయటకి రాదు అనే మాట మరొక్కసారి నిజమైంది. అగ్గిపిల్లా సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్లు ఆయన మాట్లాడితే ప్రతిదీ నేనే అన్నిటికీ నేనే అన్నీ నేనే అని చెప్పుకుంటూ తిరుగుతాడు. అసలు ప్రపంచంలో కనిపించే వినిపించే ప్రతిదానికి నేనే కారణం అన్నట్లు ఉంటాయి ఆయన మాటలు…
అదేంటో గాని పాత సామాన్లు కొనేవాడిలా చంద్రబాబు నోరు విప్పితే నేను హైదరాబాదును కట్టాను, ప్రధానలను ప్రమోట్ చేశాను, రాష్ట్రపతులను తయారు చేశాను, సెల్ ఫోన్లు కంప్యూటర్లు కనిపెట్టాను, అని చెప్పిందే చెప్పరా పాచిపల్లదాసరి అన్నట్టు అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులాగా అవే కుళ్ళు జోకులు వేసుకుంటూ తిరుగుతాడు. చెప్పే సోది కబుర్లు కనీసం జనం నమ్ముతున్నారా లేదనే సోయ కూడా లేకుండా ప్రపంచం తో అసలు సంబంధం లేకుండా తాను అనుకున్న చెత్తని అదే పనిగా పిలిపిస్తూనే ఉంటాడు.
ఇంతకాలం చంద్రబాబు భజన మేళం భరించలేక చెవులు చిల్లులు పడిపోయిన జనానికి ఇప్పుడు మరో కొత్త భజన బాకా తయారయింది. ఆయన కోడలు రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరో తలనొప్పి మొదలైంది. మామగారి బాటలో నడుస్తుందో లేక నారా వారి నీరు వంట పట్టిందో గాని ఆయన కోడలు బ్రాహ్మణి కూడా బయటకు వచ్చి మా మామయ్య హైదరాబాదును కట్టాడు అని గత పాతికేళ్లుగా వింటున్న పాత రాగాన్ని కొత్త ట్యూన్ లో వినిపించడం మొదలుపెట్టింది. దీనితో తలలు పట్టుకోవడం తెలుగు ప్రజలంతా వంతయింది.