సీఎం వైయస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధంబస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. కాగా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. కాగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులినోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ఒక్కరూ గుర్తు పెట్టుకోండని ప్రజలను హెచ్చరించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి, మూడు సార్లు సీఎంగా నేను చేశాను అని చెప్పుకొనే ఈ చంద్రబాబు నాయుడుకు కనీసం ఏరోజు ఆలోచన కూడా రాలేదు. ఈ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి, ఇంటింటికీ మంచి జరగాలి, మంచి చేసే పరిస్థితి రావాలి, లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకుని రాగలుగుతాము అన్న ఆలోచన ఏరోజూ రాలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా జన్మభూమి కమిటీలు పెట్టడం, వాటి ద్వారా అజమాయిషీ చేయించడం, ఒకవైపున లంచాలు తీసుకుంటూ, మరోవైపున వివక్ష చూపుతూ, ఏ పార్టీ వాళ్లు అని అడుగుతూ, వాళ్ల పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయాలి అని తాపత్రయ పడుతూ చివరకు అది కూడా సరిగ్గా చేయక చంద్రబాబు నాయుడు అనే మనిషి అధ:పాతాళానికి ఎలా వెళ్లిపోయాడో మనమంతా కూడా చూస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్ట మొదటి సంతకం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రేపు ఉగాది కాబట్టి… మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.