రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా పై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పడం, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి […]
సీఎం వైఎస్ జగన్ 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక ప్రజాతీర్పు పై గురువారం ట్వీట్ చేసారు “దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.” ఈ ట్వీట్ తో వైసీపీ […]
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయి అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా […]
ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో మరిన్ని కీలక సాఫ్ట్వేర్ సంస్థలు అదే బాటలో అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు విశాఖ వైపు దృష్టిసారిస్తున్నాయి. కేప్ జెమినీ సంస్థ కూడా అదే దారిలో పయనిస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగుల మధ్య ఆ సంస్థ సర్వే నిర్వహించగా […]
ఎన్నికల లెక్కింపు పక్రియ, ఎగ్జిట్ పోల్స్, తేదీల దగ్గరకి వచ్చేసరికి తెలుగు దేశం పార్టీ క్యాడర్ డీలా పడుతుంది, ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావేమో అనే అంశం వాళ్ళ క్యాడర్ ని తీవ్రంగా కలచివేస్తుంది, టీడీపీ అనుబంధ మీడియా సంస్థలు కూడా అసహన పూరిత విశ్లేషణలు కూడా వీళ్ళను పూర్తి నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు జూన్ 4న పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ని […]
దాదాపుగా 15 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు చూశాడు జగన్. ఎన్నో కష్టాలను నష్టాలను భరిస్తూ ఎన్నో అవమానాలకు ఎదురీదుకుంటూ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. ఆయన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత జగన్ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే పేద ప్రజల కోసం తన తండ్రి ఒక అడుగు వేస్తే, తాను రెండు అడుగులు […]
2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. ప్రత్యతి ప్రతిపక్ష పార్టీలు మాది గెలుపు అంటే మాది గెలుపు అంటూ హోరాహోరీ యుద్ధాన్ని తలపించాయి. మీడియా ముందుకు రావడం పాపం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద నోటికి వచ్చినట్లు విరుచుకు పడే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూగబోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయా […]
ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు టీడీపీ పోస్టల్ బ్యాలెట్‌పై ఓ ఇమెజ్‌ను క్రియేట్ చేసుకొని గతంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్‌పై నమ్మకం పెట్టుకున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్‌పై సీరియల్ నంబర్ లేదని రిజెక్ట్ […]
అసత్యపు ప్రచారాలతో అంట కాగడం తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి ఉన్న అలవాటే.. సంబంధం లేని ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ టీడీపీ అనుకూల ఎల్లో మీడియా, అనుబంధ విభాగాలతో తప్పుడు ప్రచారాలు చేయటం టిడిపికి ఆనవాయితీ… తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు ఎప్పుడు బట్ట కాల్చి మీద వేసే చందాన ఉంటాయనేది చరిత్ర చెబుతున్న విషయం. ఆ క్రమంలోనే మాచర్లలో జరిగిన అల్లరి విషయంలో మరో తప్పుడు ప్రచారానికి తెర తీసి నవ్వులు పాలయింది […]
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి నాలుగు రోజులు క్రితం హైకోర్టు లో ఊరట లభించిన విషయం తెలిసిందే, అయితే మాచర్ల అల్లర్ల నిమిత్తం ఏపీ పోలీసులు పెట్టిన మరో మూడు కేసులలో కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, ఎలక్షన్ కౌంటింగ్ ముగిసేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులుకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో […]