2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కలగలిసి ఎన్నికల బరిలో దిగుతున్నవేళ టీడీపీ, బీజేపీ పొత్తు వ్యవహారం ఆశ్చర్యకరంగా మారింది. మామూలప్పుడు బీజేపీపై రెచ్చిపోయి రంకెలేసే చంద్రబాబు.. ఈ ఎన్నికలకు మాత్రం ఆ పార్టీతో పొత్తు కోసం కాళ్ల భేరానికి సైతం వెనకాడలేదంటూ బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు.. నేను తిరగబడ్డ తెలుగుబిడ్డను అన్నాడు. జాతీయస్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసి మోదీని దించుతానన్నాడు.. బీజేపీని పడగొట్టేది నేనే […]
‘దుష్టశిక్షణ.. శిష్టరక్షణ కోసం శ్రీరాముడు అంతటి వారే ఆంజనేయస్వామితోపాటు ఉడుత సాయం తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. దుష్టశిక్షణ.. శిష్టరక్షణ జరగాలి. కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటా’ తెలుగుదేశం, జనసేనతో పొత్తు కుదిరిన నేపథ్యంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల సంగతేంటని విజయవాడలో ఆదివారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అది. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే లక్ష్యం. అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తాయి. దీనికి బీజేపీ ఏమీ […]
చంద్రబాబు బిజేపీ పొత్తు పొడిచినట్టే . తాను ఏంచేసినా లోకకళ్యాణం కోసం, తీసుకునేవన్నీ చారిత్రాత్మక నిర్ణయాలే అని భావించే బాబు ఢిల్లీలో పగలు రాత్రి కాపు కాచి ఎట్టకేలకు బీజేపీతో పొత్తుని ఖరారు చేసుకున్నట్లుంది . బీజేపీకి ఆరు యంపీలు, పదహారు ఎమ్మెల్యేల సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చేందుకు బాబు ఒప్పుకున్నారని సమాచారం . ఢిల్లీలో ఈ నెల 14 న NDA మీటింగ్ జరిపి.. అధికారికంగా పొత్తులు ఆ రోజు ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీ […]
2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజ్ అంటూ కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు చివర్లో బీజేపీకి ఎదురు తిరిగి పెద్ద డ్రామానే నడిపారు. అందులో భాగంగానే హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి చేయించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపై ఘాటైన విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో భూస్థాపితం కానున్న టీడీపీని బ్రతికించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అందుకోసం […]
2024 సార్వత్రిక ఎన్నికలకు 40 రోజులు సమయం కూడా లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల పొత్తులు ఇంకా ఒక తాటి పైకి రాలేదు. ఇప్పటికే టిడిపి జనసేన పొత్తు ఖరారు అయినప్పటికీ, బిజెపితో ఇంకా పొత్తు ఖరారు కాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనానీ అందరూ ఊహించినట్టే టిడిపితో జత కట్టాడు. ఒకవైపు బిజెపితో ఉంటున్నట్లు నటిస్తూనే టిడిపితో జత కట్టేసి 2024 ఎన్నికలకు 24 సీట్లలో పోటీ చేస్తున్నట్లు […]
మొన్న చంద్రబాబు బహిరంగ సభలో అరకు, మండపేట అభ్యర్థులని ప్రకటించాడని, జనసేన కార్యకర్తల, కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన ఒత్తిడి మేరకు నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తా అని పవన్ నిన్న రాజోలు రాజానగరం అభ్యర్థులని ప్రకటించి టిట్ ఫర్ టాట్ అనగా, పొత్తుపై సందేహాలు నెలకొన్నాయి.. తరువాత జరిగిన చర్చల ఫలితంగా మళ్లీ పొత్తు కొత్తగా చిగురించింది అని అందరూ భావించారు.. మరోపక్క ఆంధ్రజ్యోతిలో బీజేపీ తో నేడే పొత్తు ప్రకటన, రేపు […]