ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లే రాజకీయ పార్టీలకు అధికారం కట్టబట్టే నిర్ణేతలని పోలింగ్ శాతం చూస్తే స్పష్టమౌతుంది. ఈవీఎంల ద్వారా పోల్ అయిన ఓట్ల మొత్తంలో పురుషుల కన్నా 4,78,325 మంది మహిళా ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వారిలో వచ్చిన చైతన్యానికి ఒక కొలబద్దగా చూడొచ్చు. ఈ ఓటింగ్ సరళిని పరీశీలిస్తే ఖచ్చితంగా అధికార పార్టీకే ఎన్నికల్లో లాభం చేకూరే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న మాట. జగన్ తన 5ఏళ్ల సంక్షేమ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు మహిళలకి ఇళ్ళ పట్టాలు అందించడమే కాకుండా పెద్ద ఎత్తున నగదు రూపంలో సంక్షేమ ఫలాలు అందించారు. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నట్టు చెబుతున్నారు.
ఈసీ విడుదల చేసిన పోలింగ్ శాతం లెక్కలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఈవీఎం లో పోలైన పురుషుల ఓట్లు మొత్తంగా 1,64,30,359 ఉంటే మహిళా ఓట్లు మాత్రం 1,69,08,684 ఉన్నటు తెలుస్తుంది అదే విదహంగా థర్డ్ జండర్ ఓట్లు 1,517 పోల్ అయినట్టు చెబుతున్నారు. ఇది మొత్తంగా చూస్తే 3,33,40,560 ఓట్లు పోల్ అయ్యాయి, ఇది 80.66 శాతం గా చెబుతున్నారు. ఇక పోస్టల్ బాలెట్ చూస్తే మొత్తం 4,44,216 ఓట్లు, హోం ఓటింగ్ 53,573 కలిపి మోత్తం 4,97,789 ఓట్లు పోల్ అయ్యాయి. ఇది మొత్తం 1.2% శాతం. ఈవీఎం ఓట్లు, పోస్టల్ బాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఓట్లు కలిపి మొత్తంగా 3,38,38,349 ఓట్లు పోల్ అయినట్టు ఇది మొత్తంగా 81.86 శాతంగా ఎన్నికల కమీషన్ నిర్ధారించింది.