ఐపీఎల్ 2024 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 231 పరుగులు చేసింది. మొదటి వికెట్ కి వీళ్లిద్దరు కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు , ఈ సీజన్ లో ఇదే అత్యధిక భాగస్వామ్యం.
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది, తరువాత వచ్చిన బ్యాటర్లు డారిల్ మిచెల్ 63 పరుగులు, మొయిన్ అలీ 56 పరుగులు చేశారు. నాల్గో వికెట్కు వీళ్ళిద్దరూ 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు, వీళ్లు ఔట్ అయిన తరువాత మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోవడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టుకు పరాభవం తప్పలేదు
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2, ఉమేశ్, సందీప్ వారియర్ చెరో వికెట్ తీశారు. చెన్నై టీం ఓటమితో లీగ్ రౌండ్ మరింత ఆసక్తికరంగా మారింది.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభ్మన్ గిల్ ఎంపిక అయ్యాడు.