నేడు ఐపీఎల్ లో భాగంగా కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, తలపడనున్నాయి, ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఉంది, మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్, ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని నమోదు చేసుకుంది, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కోల్కత్తా 8 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ చిట్టా చివరి స్థానంలో కొనసాగుతుంది, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల స్థానంలో పటిష్టంగా ఉంటుంది
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగగా అందులో ముంబై 23 మ్యాచ్‌లు గెలుపొందగా, కేకేఆర్ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరగగా , అందులో ముంబై 7 గెలిచి, కేకేఆర్ 3 గెలిచింది. ఇరు జట్ల బలాబలాలు చుస్తే కోల్‌కతానే ముంబై కంటే బలంగా కనిపిస్తుంది