2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కలగలిసి ఎన్నికల బరిలో దిగుతున్నవేళ టీడీపీ, బీజేపీ పొత్తు వ్యవహారం ఆశ్చర్యకరంగా మారింది. మామూలప్పుడు బీజేపీపై రెచ్చిపోయి రంకెలేసే చంద్రబాబు.. ఈ ఎన్నికలకు మాత్రం ఆ పార్టీతో పొత్తు కోసం కాళ్ల భేరానికి సైతం వెనకాడలేదంటూ బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు.. నేను తిరగబడ్డ తెలుగుబిడ్డను అన్నాడు. జాతీయస్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసి మోదీని దించుతానన్నాడు.. బీజేపీని పడగొట్టేది నేనే అన్నాడు.. 15 పార్టీలతో బీజేపీ వ్యతిరేకజట్టు అంటూ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని మోదీ నుండి కాపాడేది నేనేనంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికాడు..
పచ్చ ఛానెల్స్ సైతం మోదీకి ఎదురెళ్ళగల మొనగాడు బాబేనంటూ జాతీయస్థాయిలో చంద్రబాబును పైకెత్తాయి. తరువాత తరువాత ఈ జట్లు గిట్లు ఎటు పొయ్యాయే కానీ మళ్ళీ ఇప్పుడు వేరే కొత్త రాగంతో చంద్రబాబు అండ్ కో బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలో దిగబోతున్నాయట.. అప్పుడు తెలుగు బిడ్డను నేను అంటూ బీజేపీకి వ్యతిరేకం అన్న చంద్రబాబు మరి ఇప్పుడు ఎవరి బిడ్డగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడో మరి. కొసమెరుపు ఏంటంటే ఆ అబద్దాల తెలుగుబిడ్డ దత్త బిడ్డ అయిన పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల కోసం చాలా కష్టపడ్డాడట.. అంత తిట్లు తిట్టించుకోని మరీ చంద్రబాబు బీజేపీతో పొత్తుకు పాకులాడాడంటే ఎంత దిగజారిపోయాడో.. ఈ దిగజారుడు రాజకీయాలు ఇప్పుడు టీడీపీ, జనసేన అనుచరవర్గాలలో చిచ్చులు రేపుతున్నాయి.