జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీకొత్తచరిత్ర సృష్టించబోతుందని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధమని, ఈ యుద్దంలో ప్రజలు నిజమైన నాయకుడు వైయస్ జగన్ కే పట్టం కట్టబోతున్నారని ఆయన అభిప్రాయ పడ్దారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్లోకి వెళ్ళి రౌడీ మూకల చేత పల్నాడు జిల్లాతో పాటు అనేక చోట్ల వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమీషన్ పట్టించుకోలేదని, కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారని, పోలీసులు సైతం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తామని వైఎస్సార్సీపీకి ఈ ఎన్నికల్లో అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారర్టీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారని వీళ్లల్లో ఎవ్వరిని వదలమని చట్ట ప్రకారం శిక్షలు పడేలా ముందుకు వెళతామని రాబోయే రోజుల్లో వీరు చేసిన దానికి ఖచితంగా ప్రతిఫలం ఉంటుందని ఆయన హెచ్చరించారు.