చదివింది పదో తరగతే, అదీ పాస్ అయినట్లు గ్యారంటీ లేదు, ప్రత్యేకంగా ఏ టాలెంటు లేదు. అయితేనేం కోట్లు వచ్చిపడుతున్నాయి. గల్ఫ్ దేశాల నుండి రాగానే మహాసేన పేరుతో దళిత జాతిని ఉద్ధరిస్తా అని చందాలు వసూలు చేసి లెక్క అడిగిన వారి తల్లి భార్య లను తిట్టించి భయపెట్టి సొమ్మంతా అనుభవించాడు. కూలీ నాలీ చేసుకునే అమాయకపు దళితుల వద్దనుండి డబ్బులు సేకరించి ఆడి కార్ లో తిరుగుతూ ఎవరో కష్టాన్ని లగ్జరి గా ఖర్చు చేసుకునేవాడు.. వైసీపీ లో ఎవరు కనీసం పట్టిచుకోవడం లేదని పార్టీ నుండి బయటికి వచ్చి టీడీపీ లో చేరాడు… అనూహ్యంగా బాబు పి గన్నవరం సీటు అనౌన్స్ చేయగా జనసేన, బీజేపీ ఆఖరికి టీడీపీ క్యాడర్ నుండి కూడా వ్యతిరేకత రావడం తో పోటీ నుండి తప్పించాడు బాబు..
ఆ తప్పించడం లో కూడా రాజేష్ కు సొమ్ము పోగైంది. పి గన్నవరం నుండి పోటీ చేయబోయే అభ్యర్థి నుండి లోకేష్ మూడు కోట్ల రూపాయలు ముట్టజెప్పించాడు.. అంతటితో రాజేష్ ఆశ తగ్గితే అతను రాజేష్ ఎందుకు అవుతాడు. రాష్ట్రవ్యాప్తంగా మాలలు వైసీపీ కి ఏకపక్షంగా ఓట్లు వేస్తారని తెల్సిన బాబు, మాదిగ వర్గం వారి ప్రాప్తం కోసం ఎస్సీ వర్గీకరణ అంశం నెత్తికి ఎత్తుకోగా మాదిగ వర్గం ఓట్లు తనకే అని భావిస్తూ మాలలు మొత్తం వైసీపీ వైపు ఏకపక్షంగా ఓట్లు వేయకుండా చేసేందుకు రాజేష్ ను రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో మహాసేన తరపున అభ్యర్థులను నిలిపేందుకు పథకం వేశాడు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు రాజేష్ కి మళ్లీ ఉచితంగా కోట్లు వచ్చి పడినట్లు అయింది. ఇక మహాసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల నుండి కాస్త వసూలు చేస్కోవచ్చు. అలాగే బాబు నుండి ఆ క్యాండేట్ ల ఖర్చుల పేరుతో మరింత రాబట్టొచ్చు అనేది రాజేష్ ప్లాన్. వద్దంటే డబ్బు వచ్చిపడుతోంది రాజేష్ కి.
పాపం తన రాజకీయ జీవితంలో ఎంతోమందికి డక్కా ముక్కలు తినిపించిన బాబు రాజేష్ చేతిలో బకరా అవుతున్నాడు. ఎలాగూ ఓడిపోయే పంచాయితీ కోసం రాజేష్ లాంటి వాళ్లకు అంతంత డబ్బు ముట్టజెప్పడం ఈ వయసులో బాబుకు అవసరమా అని టీడీపి నాయకులే గుసగుసలాడుకుంటున్నారు..