వక్రభాష్యాలు చెప్పడంలో ఎల్లో మీడియాకి ఎవరూ సాటి రారు. తనకు నచ్చిన వాళ్లు ఏ పని చేసినా గొప్పగా చిత్రీకరిస్తుంది. ప్రత్యర్థి పార్టీలు నిజంగా మంచి చేసినా స్వార్థం కోసమేనని ప్రచారం చేస్తుంది. ఎన్నికల నేపథ్యంలో విలేకరులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తాయిలాలు ఇస్తున్నారని ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు అధికంగా ప్రచురితమతున్నాయి. పాజిటివ్ వార్తలు రాయించుకునేందుకు ఇలా చేస్తున్నారని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నమిది.
నిజానికి వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు, సినీ నిర్మాతలు విలేకరులకు బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతోంది. చాలా సంవత్సరాలుగా ఉన్న సంస్కృతి ఇది. పొలిటికల్ పార్టీల విషయానికొస్తే విలేకరులను మచ్చిక చేసేకునేందుకు స్పెషల్ ఫండ్ పెడుతుంది తెలుగుదేశం. ఇది జగమెరిగిన సత్యం. తాయిలాలు ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు నాయుడు. ఈ విషయం సీరియర్ జర్నలిస్టులకు తెలుసు. చిన్నపాటి అకేషన్ వచ్చినా సరే అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. పార్టీ కార్యాలయం లేదా నేతల ఆఫీసుల నుంచి స్వీట్ బాక్స్‌లు పంపుతారు. ఇక తమ ఎల్లో మీడియా గ్యాంగ్‌కు అయితే నగదు కూడా ఇస్తారు. బహుమతులు ప్రతి పార్టీ ఇస్తాయి. ఆఖరికి కమ్యూనిస్టులు కూడా తమకు తోచించి ఇస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ వైఎస్సార్సీపీపై ఈనాడు, జ్యోతి ఏడుపుని చూస్తే కచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమేనని అర్థమవుతుంది.
కొంతకాలంగా చంద్రబాబు తనకు బాగా అనుకూలంగా ఉండే ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రిపోర్టర్లతో బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వారికి పెద్ద ఎత్తున నగదు అందిస్తున్నారు. కానీ దీనికి వాళ్లిచ్చిన బిల్డప్ రాష్ట్రాభివృద్ధి కోసం జర్నలిస్టుల నుంచి సలహాలు తీసుకోవడమంట. అదే వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు విలేకరులతో సమావేశమైతే తాయిలాలు ఇస్తున్నారని ఎన్నడూ లేని విధంగా తాటికాయంత అక్షరాలతో రాస్తున్నారు. వీరు ఎన్నికలకు సలహాలు తీసుకోవడం కోసమే అనుకోవచ్చు కదా..
ఎన్నికల నేపథ్యంలో ఇటీవల తెలుగుదేశం అధిష్టానం నుంచి జిల్లా పార్టీ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. నియోజవర్గాల అభ్యర్థులు కావొచ్చు. టికెట్లు ఆశిస్తున్న వారు కావొచ్చు. వార్తలు కవర్ చేసే టీడీపీ బీట్ రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లకు ప్రతి వారం ప్యాకేజీ ఇవ్వాలి. సర్క్యులేషన్‌ను బట్టి అమౌంట్ చేరాలి. ఒక్కొక్కరికి వారానికి రూ.500 నుంచి రూ.1000 వరకు అందేలా చూడాలి. పండగల సమయంలో గిఫ్ట్ బాక్స్‌లు పంపాలి. పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను నేతలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మీడియా కో–ఆర్డినేషన్ కోసం నేతల్ని నియమించుకుని వారి ద్వారా పనులు చక్కబెడుతున్నారు. చిత్తూరు నియోజవకర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు గత సంవత్సరం దీపావళి సందర్భంగా ట్రస్ట్ పేరుతో విలేకరులకు టపాసులు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుంగా దీనికి సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. దీంతో ఎల్లో మీడియా వారే ఆగ్రహించి పార్టీ సీనియర్ నాయకులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. చివరికి ఆ ఫొటోలను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇక చంద్రబాబు ఆదేశాలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రిపోర్టర్లకు ఎక్కడ లేని గౌరవం ఇస్తున్నారు. మరి ఇదంతా తాయిలాల కిందకు రాదా.. ఇదెక్కడి నీతి..
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎల్లో మీడియా బరితెగించి రాస్తోంది. మేము చేసిందే మంచి.. గిట్టని వాళ్లు చేస్తే అది చెడు లెక్కన ఉంటున్నాయి వాటి రాతలు. ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్న పిల్లలకు చాక్లెట్లు కొనిస్తే.. భవిష్యత్ ఓటర్లకు ఇప్పటి నుంచే ఎర అని ప్రచారం చేసే పరిస్థితులు వచ్చాయి.
విలేకరులకు వైఎస్సార్సీపీ తాయిలాలంటూ రాసి మురిసిపోతున్న రామోజీరావు ఇక్కడ కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. ప్రతి ఏడాది జనవరి ఫస్ట్‌కు కొద్దిరోజుల ముందు జిల్లా ఉన్నతాధికారులను, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పుర ప్రముఖులను, వ్యాపారవేత్తలను ఈనాడు ప్రతినిధులు కలిసి స్వీట్ బాక్స్‌లు, వారి పేరుతో డైరీలు ఇస్తుంటారు. ఏ లాభం ఆశించి ఇలా చేస్తున్నారో కురవృద్ధుడే సెలవివ్వాలి.