ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వాడి వేడిగా జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికలు సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలలో 2014లో కలిసి పోటీ చేసినట్లుగానే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా టిడిపి బిజెపి జనసేన కలిసి మళ్లీ కూటమి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే ఎన్నికల బరిలో ఒంటరి పోరుకు దిగనుంది. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎల్లో కూటమికి ఉమ్మడి మేనిఫెస్టో లేదు. ఎవరికి వాళ్లు వారి వారి సొంత మేనిఫెస్టోతో ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన హామీలు వారు ఇచ్చుకుంటూ పోతున్నారు. గతంలో ఇచ్చినట్లుగానే ఏమాత్రం చిత్తశుద్ధి లేని అలవికాని హామీలు ఇచ్చుకుంటూ తమ తమ ప్రచారాలకు మొగ్గు చూపుతున్నారు. మరొకపక్క చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ, జనసేనవి కాదు. అలాంటప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలను వారు అంగీకరించే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ పవన్ చంద్రబాబుతో తనకున్న రహస్య ఒప్పందాన్ని బట్టి అంగీకరించి ప్రశ్నించకపోయినా బీజేపీ ప్రశ్నించకుండా ఉంటుందా..? బిజెపి ప్రశ్నించకపోవటానికి పురందేశ్వరి మాత్రమే శాశ్వతంగా ఏపీ బీజేపీ అధ్యక్ష స్థానంలో ఉండరు కదా.. అలా అనుకుంటే అంతకుమించిన అమాయకులు ఎవరు ఉండరు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే తనకు బాగా అలవాటైన మోసపూరిత హామీలే ప్రధానాంశంగా ముందుకు సాగుతున్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తాడట! ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామని చెప్తున్నాడు. అసలు ఈ వాగ్దానం నమ్మశక్యంగా ఉందా..? ఈ వాగ్దానాన్ని కూటమిలో ఉన్న బీజేపీ ఒప్పుకుంటుందా..? 30 వేల ఎకరాల్లో లక్షల కోట్లు పెట్టి రాజధాని కడతానంటే ఒప్పుకోని బీజేపీ ఈ అలవికాని హామీని సమర్థిస్తుందా? కచ్చితంగా ఇలాంటి మోసపూరిత హామీలను ఏమాత్రం ఒప్పుకోదు అనే చెప్పాలి.
ఎందుకు అంటే బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.. ఇక్కడ ఆంధ్రప్రదేష్ లో బాబు ఇచ్చే వాగ్దానానికి బీజేపీ వంత పాడితే మిగిలిన వారి పాలిత రాష్ట్రాల గొంతెమ్మ కోర్కెలను కూడా తప్పనిసరిగా భరించాలి.. ఇక చంద్రబాబు చేసే వాగ్దానాలకు రాష్ట్ర బడ్జెట్ సహకరిస్తుందా అంటే… 2019లో ఎన్నికల నాటికి ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయిన చంద్రబాబు, 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల మ్యానిఫెస్టోని ఎన్నికల అనంతరం మూడు నెలల కాలంలోనే వెబ్సైట్ నుంచి తొలగించిన చంద్రబాబు ఏ మాత్రం చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడో తెలిసిన వారికి ఇప్పుడు ఇస్తున్న హామీలు ఎంతవరకు నెరవేరుతాయో పూర్తి అవగాహన ఉంటుంది.