పేద మధ్యతరగతి కుటుంబాలలో ఎంతోమంది ప్రజలకు ఆరోగ్య భరోసా కలిగించిన దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అయితే ఆయన మానస పుత్రిక ఆరోగ్య శ్రీ.. ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు దక్కించుకున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏప్రిల్ 1, 2007 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు. అయితే వైఎస్సార్ గారి మరణానంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ని సవ్యంగా అమలు చెయ్యలేదు.. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేసింది.
ఏపీలో చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో 2018-19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఖర్చు చేసింది.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గత సర్కారు బకాయి పెట్టిన రూ.631 కోట్లను నెట్వర్క్ ఆస్పత్రులకు వైసీపీ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో 2019 నుంచి 2023 ఆగస్టు నెలాఖరు నాటికి 46.12 లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించారు. అందుకోసం ఏకంగా రూ. 9,193.61 కోట్లు ఖర్చు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరు ఇండోర్ స్టేడియంలో జనవరి 3, 2020 న ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. మే, 2019లో ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా.. జనవరి, 2020లో 2059 కి.. జూలై, 2020లో 2200 కు చికిత్సల సంఖ్యను పెంచారు. అప్పుడు అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్ చికిత్స ప్రొసీజర్లు కూడా ఉన్నాయి. 2020, 2021 సంవత్సరాల్లో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6, 2020 న కరోనాను.. కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి 2021 మే, జూన్ నెలల్లో చేర్చింది. అనంతరం నవంబర్, 2020 లో 2436 కు ఈ సంఖ్యను పెంచగా.. మే-జూన్, 2021లో 2446 కు.. 2022 లో 3255 కు పెంచారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలో అమలవుతున్న చికిత్సలసంఖ్య 3,255కి చేరింది.
అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఆరోగ్య భద్రత విషయంలో వైఎస్ జగన్ ఆలోచించే తీరు అందరికంటే విభిన్నం అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2,513 ఆసుపత్రుల్లో పేదలకు ఖరీదైన చికిత్స అందిస్తున్పారు.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ.25 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 18, 2023 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులు అందించింది.. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న పేద కుటుంబాలను రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నవశకం కార్యక్రమంలో గుర్తించి ఆ కుటుంబాలకు డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలోని సుమారు 4.25 కోట్ల మందికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుంది.
అందరికీ ఆరోగ్య శ్రీ ఊపిరిపోస్తే.. ఆఖరి శ్వాసలో కొట్టుకుంటున్న ఆరోగ్య శ్రీ కి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాణం పోసారు.