తిరుపతి టికెట్ విషయంలో జనసేన నేతలను ఒప్పించడం పవన్ కళ్యాణ్‌కు తలనొప్పిగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆరణి శ్రీనివాసులుకు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వాలన్న డిమాండ్‌ను మరోసారి జనసైనికులు పవన్ ముందు పెట్టారు.
ఆరణి ఒత్తిడితో పవన్ శుక్రవారం హడావుడిగా తిరుపతికి వెళ్లారు. సేనకు చెందిన కిరణ్ రాయల్, హరిప్రసాద్, రాజారెడ్డి, కీర్తన, సుభాషిణి, హేమకుమార్, కిశోర్, మనోజ్, టీడీపీకి చెందిన నరసింహ యాదవ్, ఊకా విజయ్‌కుమార్, జేబీ శ్రీనివాస్, పెద్దప్ప తదితరులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తర్వాత కలిపి మాట్లాడారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సేనకు చెందిన కిరణ్ రాయల్‌తో విడివిడిగా చర్చించారు.
ఆరణి గతంలో టీడీపీలో ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో ఆయన తనను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నేతలకు పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు పవన్ చెప్పిన అంశాలకు తలూపారు. సేన నేతలు మాత్రం స్థానికేతరుడికి టికెట్ వద్దని గట్టిగా చెప్పారని తెలిసింది. ఆరణి పార్టీలు మారుతుంటారని, ఆయనకు ప్రజాబలం లేదని, కచ్చితంగా ఓడిపోతాడని చెప్పగా సేనాని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆయన పార్టీకి భారీగా ఫండ్ ఇచ్చారని, అందువల్ల తప్పక అవకాశం కల్పించానని ఒప్పుకోవాలని బతిమిలాడినట్లు సమాచారం.
కిరణ్ రాయల్‌తో పవన్ విడిగా చర్చించగా అతను తీవ్ర స్వరంతో మాట్లాడినట్లు తెలిసింది. మీ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, జగన్, మంత్రులను వ్యక్తిగతంగా తిట్టాను. కానీ నాకు అన్యాయం చేశారని అధ్యక్షుడి వద్ద కుండబద్ధలు కొట్టారు. ఎదురు చెప్పకుండా తన మాట వింటాడని భావించిన సేనాని అవాక్కయ్యాడు. ఆరణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఇప్పిస్తానని, కూటమి ప్రభుత్వం వస్తే ఏమైనా చేసుకునే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే తిరుమలలో దర్శనాల విషయంలో ఆరణి సహకరిస్తారని, ఇప్పుడు ఆయన కోసం పనిచేయాలని పవన్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయాలను కిరణ్ తన సన్నిహితులకు చెప్పాడట. కాగా నేతలంతా అధ్యక్షుడిని రెండు, మూడు రోజులు సమయం అడిగారని సమాచారం.
నేతల మధ్య సమన్వయం కోసం పవన్ తన అన్న నాగబాబును నియమించారని తెలిసింది. అతను కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నాడు. ఆరణి నుంచి సేన నేతలకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాగబాబుకు అప్పగించారు. ఇంత జరిగితే పవన్ పీఆర్ టీం చాలా తెలివిగా వ్యవహరించింది. తిరుపతి నుంచి వైఎస్సార్సీపీ నుంచి తరిమేందుకు అందరూ ఒప్పుకొన్నారని ప్రచారం మొదలుపెట్టింది. పవన్ ఆదేశాలను కూటమిలోని నాయకులు పాటిస్తారని డబ్బా కొట్టుకుంది.