తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వల్ల ఆరోగ్యకర రాజకీయాలు ఏనాడో పోయాయి. టీడీపీలో హుందానం కరువైంది. పైశాచికానందం పొందడం అధికమైంది. బాబుతో సావాసం చేసేవారు అలాగే తయారయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాశ్వతంగా లేకుండా చేసేందుకు నారా వారు రెండోసారి ప్రయత్నించారు. అయితే ప్రజల ఆశీస్సులతో ఆయన మరోసారి బయటపడ్డారు. కుట్ర చేసింది టీడీపీ, జనసేన కాబట్టే బాధితుడి పట్ల మానత్వం చూపకుండా చుకలనగా మాట్లాడుతున్నాయి. దేశంలో పేరొందిన నేతలు మాత్రం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
దాడిని ఖండిస్తున్నాం.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేని ఎల్లో గ్యాంగ్ చెప్పలేకపోయింది. చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్.. ఇంకెక్కడి నుంచి వస్తా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా’ అంటూ ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ‘చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్.. అస్సలు స్క్రిప్టెడ్‌లా అనిపించడంలేదు’ అని పోస్టు పెట్టారు. సోషల్ మీడియాలో ఆయా అధికారిక పేజీల్లో అయితే దారుణంగా రాతలు రాస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పవన్ నన్ను చంపడానికి గుండాలు వస్తున్నారు. రెండువేల మందిని దింపారు.. హత్య చేయడానికి రూ.వెయ్యి కోట్లు సుపారీ ఇచ్చారని గతంలో చాలాసార్లు అన్నారు. అది నిజం కాకపోయినా సింపతీ డ్రామాలు ఆడాడు. తాజాగా బ్లేడ్లతో కోయాలని చూస్తున్నారని వాపోయాడు.
జగన్ ఏనాడూ అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు. ప్రజల్లోనే ఉన్నాడు. చంద్రబాబే కుట్రలతో ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు. రాయితో దాడి చేయించి ఎల్లో గ్యాంగ్ కాబట్టే కొంచెం కూడా జాలి చూపించలేదు. సోషల్ మీడియాలో లోకేశ్, నాగబాబు పోస్టులపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ‘ఇన్ని మాటలు అంటున్నారు కదా.. మీలో ఎంతమంది రాళ్లతో కొట్టించుకోగలరు. ఆ రాయి మీ కన్నుకు తగిలి కంటి చూపు పోయినా సరే అనుకోగలరు’ అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్లు చేశారు. ఇది హుందానమంటే. టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉందని కదా అని మోదీ జగన్‌ది డ్రామా అనలేదు. మానవత్వాన్ని చూపించారు. కానీ లోకేశ్, నాగబాబు మాత్రం తమలోని రాక్షసత్వాన్ని బయటపెట్టారు. ఇలాంటి మనసత్వం ఉన్న ఎల్లో గ్యాంగ్‌కు ప్రజల్ని పాలించడానికి అర్హత లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.