రెండెకరాలతో ప్రారంభమైన చంద్రబాబు జీవితం రాజకీయంలోకి వచ్చి నేడు లక్షల కోట్లకి అధిపతిగా మారాడనేది కాదనలేని సత్యం. ఒకానొక పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబే నా ఆస్తి లక్ష కోట్లు అనడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయితే చంద్రబాబు నిరుపేదగా జీవితం ప్రారంభించినా డబ్బు వచ్చే సరికి ఆ డబ్బుతో పాటుగా బలహీన వర్గాలపై చిన్న చూపు , పేదలంటే లెక్కలేని తనం కూడా ఆయన కుటుంబంలోకి వచ్చి చేరాయి.
చంద్రబాబు తన రాజకీయ ప్రయాణంలో బలహీన వర్గాలవారిని అవమానించినంతగా మరే రాజకీయ నాయకుడు బడుగులపై ప్రవర్తించి ఉండరు , ఆఖరికి ఈ తరహాలో జంగిల్ రాజ్ గా చెప్పుకునే ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలైన బీహార్ యూపీ లాంటీ రాష్ట్రాల్లో కూడా నాయకులు ఈ విధంగా బహుశా ప్రవర్తించి ఉండకపోవచ్చు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్నారు, మీ తోలు తీస్తా తమాషాలు చేస్తున్నారా అంటూ మత్య్సకారులని బెదిరించారు, ఎస్సీ కులంలో ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారు అంటూ దళితులని అవమానించారు. పేదవాడి గూడుని సమాధితో పోల్చారు చంద్రబాబు.
తండ్రే ఇలా ఉంటే ఇక ఆయన పుత్ర రత్నం లోకేష్ మాత్రం ఊరికే ఉంటాడా, దళితులు పీకింది ఏం లేదు అంటూ యువగళం లో వారిపై నోరు పారేసుకుని దళితులపై ఆయనకి ఉన్న మైండ్ సెట్ ని బయటపెట్టుకున్నారు. ఇక తాజాగా చంద్రబాబు భార్య భువనేశ్వరీ సైతం బలహీన వర్గాల వారిపై నోరు పారేసుకున్నారు నేను నీకంటే పెద్దింట్లో పుట్టిన దాన్ని.. మీరు చెత్త బుట్టలో పుట్టారు.. దేనికి పనికిరాని అడుక్కుతినే వెధవల్లారా.. తప్పుడు నా కొడకా.. ఉడిగం చేసే వెధవ.. పనికిరాని.. కొడకా.. ముష్టి నా కొడకా అంటూ చెప్పలేని, రాయలేని భాషలో బలహీన వర్గాలపై నోరు పారేసుకున్నారు భువనేశ్వరీ
నారా కుటుంబానికి బలహీన వర్గాలంటే మొదటి నుండి చిన్న చూపేనని , వారిని మనుషులుగా కాకుండా ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసే మనస్తత్వం నారా కుటుంబానిదని, అందుకే బలహీన వర్గాలపై నిత్యం తమ ఆదిపత్యం చూపే దోరణిలోనే వారి ప్రవర్తన ఇంటా బయట ఉంటుందని , వీరి పెత్తందారీ పోకడలకి తాము అంతా ఓటుతో బుద్ది చెప్పే సమయం వచ్చిందని బలహీన వర్గ నాయకుల నుండి వస్తున్న మాట . సమాజం ఎంతో మారి పేద దనికా అనే భేదాలు చెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా చంద్రబాబు కుటుంభం ఇంకా పెత్తందారీ పోకడలతోనే ప్రవర్తించడం దురదృష్టకరం.