నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శిపై కొన్ని ఏళ్ల నుండి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లో మార్గదర్శిపై విచారణ నిలిపివేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘ పోరాటం అనంతరం మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు కొట్టేసింది. తీర్పును కొట్టేయడమే కాకుండా డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
దీనితో మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్ కుమార్ గారి 17 ఏళ్ల అలుపెరుగని న్యాయ పోరాటం ఫలించినట్లయింది. సుప్రీం కోర్టు తీర్పుతో దాదాపు 17 ఏళ్లుగా పట్టు వదలని విక్రమార్కుడిలా మార్గదర్శిపై ప్రజా ప్రయోజనాల కోసం వినిపిస్తున్న ఉండవల్లి వాదన నిజమే అని రుజువైంది. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మార్గదర్శి చేసిన అక్రమ డిపాజిట్ల సేకరణకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ వస్తున్న రామోజీరావుకు ఈ తీర్పు చుక్కెదురు అనే చెప్పాలి. ఈ తీర్పుతో చట్టానికి ఎవరూ అతీతులు కాదని, దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది.
నిజానికి నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. అలాంటిది అక్రమంగా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి అనంతరం వాటిని దారి మళ్లించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుని, డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే ఎలా చెల్లుతుంది? 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం అయినప్పుడు వెనక్కి ఇచ్చేసాము అనడంలో అర్థం ఏముంది? ఇలాంటి అక్రమ డిపాజిట్ల సేకరణలో న్యాయశాస్త్ర పరంగా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష కచ్చితంగా ఉంటుంది. ఈ శిక్షతోపాటు అక్రమంగా సేకరించిన డిపాజిట్లు మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే సుదీర్ఘకాలంగా ఈ కేసు విషయంలో పోరాటం చేస్తున్న ఉండవల్లి స్పందిస్తూ మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యిందని, ఆఖరికి నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని మార్గదర్శి యాజమాన్యం, రామోజీరావు తీవ్ర ప్రయత్నం చేశారు కానీ… నా పోరాటం వృథా కాలేదు అని, సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది అని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మరొకపక్క స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఈడి ఎంటర్ అవటం రామోజీరావుకు అత్యంత ఆప్తుడైన చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.