ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ వాలంటీర్ వ్యవస్థ చుట్టూనే తిరుగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ పైన మొదటి నుంచి టీడీపీ అవాకులు చవాకులు పేలుతూనే ఉంది. టీడీపీ చేసిన రాజకీయం కారణంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు దూరమైంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటు టీడీపీ హైకోర్టుకు వెళ్లడంతో ఇప్పటివరకు దాదాపు 80000 మంది వాలంటీర్లు తమకు జరిగిన అవమానం కారణంగా రాజీనామా చేశారు. కాగా ఇప్పుడు మరోసారి వాలంటీర్ల విషయం హైకోర్టుకు […]
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శిపై కొన్ని ఏళ్ల నుండి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లో మార్గదర్శిపై విచారణ నిలిపివేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘ పోరాటం అనంతరం మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు కొట్టేసింది. తీర్పును కొట్టేయడమే కాకుండా డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ […]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల కుంభకోణంలో డిజైన్ టెక్ సంస్థకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో డిజైన్ టెక్ సంస్థ నిందితుల జాబితాలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవినీతి బాగోతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడుతో పాటు ఈ స్కాంలో ప్రధాన సూత్రధారులైన సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ఎండీలు, ఇంకా పలువుర్ని […]
ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్ను ఎగవేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అల్లుడు కె.పునీత్ పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా పునీత్ అరెస్ట్ సహా ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని బాలాజీనగర్ పోలీసులకు సూచించింది. అసలేం జరిగిందంటే.. నారాయణ విద్య సంస్థల అల్లుడు పునీత్ ఎండీగా ఉన్న ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ 32 బస్సులు కొనుగోలు చేసి నారాయణ […]
కొందరి లాయర్ల తీరుపై ఏపీ హైకోర్టు మండిపింది. చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్, బీసీఐలకు ఆదేశాలిచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కుట చట్టాన్ని కొందరు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశం ఉందని ఆరోపణలున్నాయి. వారి స్క్రిప్ట్ ప్రకారం విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారని లాయర్లలోని మరో వర్గం విమర్శిస్తోంది. ఈ క్రమంలో సమ్మె చేస్తున్న వారిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా సమ్మె […]
తెలుగుదేశానికి లబ్ధి చేకూరుతుందంటే ఈనాడు ఎంతకైనా దిగజారుతుంది. జరగని వాటిని, అనని వాటిని తనే సృష్టించి కథలు అల్లుతుంది. ఆ కోణంలోనే సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి విషయంలో ఇష్టానుసారంగా రాసి అభాసుపాలైంది. ఏకంగా జడ్జి ఆ పత్రిక కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీల తనిఖీకి వెళ్లిన అధికారులపై పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, ఆయన అనుచరులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేశారు. […]
2018 అక్టోబర్ 25 నాటి ప్రతిపక్ష నేత, నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న సమయం లో వైజాక్ ఎయిర్పోర్ట్ లోని ఫ్యూజన్ ఫుడ్స్ అనే రెస్టారెంట్ లో పనిచేస్తున్న జునుపల్లి శ్రీనివాసులు కోడికత్తితో జగన్ పై హత్యాయత్నం చేశాడు . అదృష్టం కొద్దీ భుజానికి గాయంతో బయటపడ్డాడు జగన్ . ఇంకా ఈ సంఘటన విమానాశ్రయంలో జరిగింది కాబట్టి ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) […]