టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచింది ఈరోజు వరకు బీసీలు మాత్రమే. మరి ముఖ్యంగా అనంతపురంలో టీడీపీకి కొమ్ము కాసింది బీసీ సామాజిక వర్గం. అలాంటి బీసీలకు గత కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీనితో విసుగు చెందిన కీలక బీసీ కులాలు టీడీపీకి క్రమక్రమంగా దూరం జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ అయిన బల్లె శివబాలకు లోకేష్ పాదయాత్రలో భాగంగా అనంతపురంకు వచ్చినప్పుడు అర్బన్ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏ గా లేక పార్లమెంట్ నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని అందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు తీరా ఎన్నికలు రాగానే డబ్బులకు అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన చౌదరికి అవకాశం ఇచ్చారు ఇదేనా టీడీపీ లో బీసీలకు ఇచ్చే గౌరవం అంటూ మండిపడ్డారు.
కురుబ సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బల్లె శివబాల మాట్లాడుతూ నా భర్త నాగరాజు,, మా బావ కిష్ట ఇద్దరు పార్టీనే ప్రాణంగా బతికారు. నలభై సంవత్సరాలుగా టీడీపీ కోసం మా కుటుంబం మొత్తం పని చేసాము . మా సామాజిక వర్గంతో టీడీపీ కోసం పని చేశాము. ఈరోజు మాత్రం బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండ కేవలం డబ్బుల కోసం దగ్గుబాటి చౌదరికి టికెట్ ఇచ్చి బీసీలను నమ్మించి మోసం చేశారు అని వాపోయారు. అదే సమయంలో ప్రత్యర్ధి వైసీపీ పార్టీ కురుబలకు మూడు అసెంబ్లీ స్థానలు ఇచ్చింది , మంత్రులను చేసింది, ఎంపీలను చేసిందని చెప్పారు. టీడీపీ ఏమో బీసీల పార్టీ అంటూ కనీసం పోటీకి కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. తన భర్త నాగరాజు సమాధి మీద వున్న టీడీపీ కార్యకర్త అనే నేమ్ బోర్డును తొలగించి టీడీపీ అంతమే నా పంతం అని ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో, రాష్ట్రం మొత్తం తిరుగుతూ కురుబలకు ముఖ్యంగా బీసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన మోసం వివరించి టీడీపీ నేతలను ఒడించడమే మా బీసీల లక్ష్యం అని ప్రకటించారు.