ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో రాళ్ళ దాడి చేసారు. గతంలో ఇదే విజయవాడలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణలంకలో టీడీపీ వారు రాళ్ళ దాడి చేసారు. టీడీపీ సానుభూతిపరులు ఆరోజు తండ్రి వైఎస్ఆర్ మీద దాడి చేసారు ఈరోజు కొడుకు జగన్ మీద దాడి చేసారు. మొదటినుండి విజయవాడలో టీడీపీ నాయకులది దూకుడు స్వభావమే.. తమ ఆధిపత్యం చూపించుకోవడానికి దాడులు చెయ్యడం రెచ్చగొట్టటం వారికి ముందునుండి ఉన్న అలవాటు.
ముఖ్యంగా బోండా ఉమ అతని అనుచరుల మీద ఎన్నో కేసులు నమోదు అయ్యి వున్నాయి. తమ అస్థిత్వం కోసం బోండా ఉమ కుమారులు కూడా కొంత మంది అల్లరి మూకలను ప్రోత్సహించి తమ అనుచరులుగా తిప్పుకుంటున్నారు. కాల్ మని పేరుతో మహిళలను వేధించి వారి చావుకు కారణమైన సంఘటనలు అనేకం ఉన్నాయి. టీడీపీ నాయకులు కొడుకులు కార్ రేస్ లతో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భూ కబ్జాలు గురించి లెక్కే లేదు.
ఇక బుద్దా వెంకన్న టికెట్ కోసం చంద్రబాబు నాయుడి దృష్టిలో పడటానికి ఎప్పుడు రెచ్చ గొట్టే ధోరణిలోనే వుండేవారు. గన్నవరంకు రౌడీ మూకలను తీసుకెళ్ళి గొడవలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కడో వున్న మాచర్ల నియోజకవర్గంకు తన మనుషులతో వెళ్ళి గొడవలు చేసి చివరకు అక్కడ ప్రజలు తిరగబడటంతో వెనక్కి తిరిగి వచ్చిన విషయం కూడా ఇంకా ఏపీ ప్రజల కళ్ళముందు కదలాడుతునే వుంది. ఇక గద్దె రామ్మోహన్ కొన్ని రోజుల క్రితమే కృష్ణ లంక లో వైసీపీ తరుపున ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులు చెపించిన సంఘటన విజయవాడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఇదే కాదు తాడికొండ లో వినాయకచవితిలో దళిత ఎమ్మెల్యే మీద బాబు సామాజిక వర్గ నాయకుల దాడులు, వేమూరు లో మరో దళిత ఎమ్మెల్యే మెరుగ నాగార్జున మీద బాబు సామాజిక వర్గ నాయకుల దాడులు ఇవన్నీ మర్చిపోలేము. అలాగే అమరావతి ఉద్యమ పేరుతో చంద్రబాబు సామాజిక వర్గ నాయకుల ప్రోత్సాహంతో మరో దళిత బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మీద దాడులు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి చేసారు. విజయవాడలో ఈ టీడీపీ నాయకుల ఆగడాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.