దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి ఈడు పిల్లలు అంతా పూర్తిగా బడులకే వెళ్లాలన్న అత్యుత్తమ లక్ష్యంతో జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ కూడా ఏడాదికి రూ.15,000 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది. ఈ రకంగా ఈప్రభుత్వం హయాంలో 44,48,865 మంది తల్లులకు రూ.26,067.3 కోట్లను అమ్మ ఒడి కింద తల్లుల ఖాతాల్లో జమచేసింది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ కుప్పకూలిపోవాలని, పేద తల్లిదండ్రులు, మధ్యతరగతి ప్రజలు తమ బిడ్డల చదువులకోసం ఆస్తులు అమ్ముకోవాలని నిరంతరం తపన పడే వర్గానికి కొమ్ముకాస్తున్న ఈనాడు దినపత్రిక మరోసారి లక్షన్నర మంది విద్యార్థులు అదృశ్యమైపోయారంటూ ప్రభుత్వ విద్యారంగంపై దాడిచేస్తూ అసత్య కథనాన్ని ప్రచురించింది.
వాస్తవానికి చంద్రబాబు ప్రైవేట్ విద్యాలయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దాంతో అనేక ప్రభుత్వ విద్యాలయాలు మూత పడ్డాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి రాగానే నాడు – నేడు కింద ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా తయారుచేసారు. దీనితోపాటు డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐఎఫ్‌ఎపీ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబులు, బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ బోధన తదితర ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంతో ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకునేందుకు ఎక్కువ మంది విద్యార్థులకు ఆసక్తి మొదలైంది. అంతేకాకుండా నూటికి నూరుపాళ్లు బడి ఈడు పిల్లలను బడికి పంపేలా వాలంటీర్లకు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సమన్వయంచేసుకుని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇలా ప్రభుత్వ విద్యాలయాల సంస్కరణలకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.
ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థుల వివరాలను యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) ప్లాట్‌ఫాంతో పూర్తిగా అనుసంధానం చేయడంతోపాటు ఏకకాలంలో వివరాలు నమోదయ్యేలా స్టూడెంట్ పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ చేసింది. మధ్యలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం ప్రభుత్వం నుంచి వారికి ఇవ్వాల్సిన విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాలను వర్తింపుకు వినియోగించుకుంటోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకూ 85.02 లక్షల మంది విద్యార్థులు దీంట్లో రిజిస్టర్ కావడం గమనార్హం. ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సహా తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల గత ఏడాదితో పోలిస్తే 1,49,515 మంది విద్యార్థులు పెరిగారు. దీంతో ప్రాథమిక – హైస్కూల్ స్థాయిలో గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో (GER) 100శాతం కాగా, 11, 12 తరగతుల స్థాయిలో74.87 శాతంగా ఉంది. ఈ ప్రక్రియలో ఎక్కడా బోగస్ పేర్ల నమోదుకు కాని, మరే ఇతర పొరపాట్లకూ గాని ఎక్కడా ఆస్కారం లేదు. కానీ జగన్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కేందుకు లేని విద్యార్థులను ఉన్నట్లుగా చూపిస్తున్నారంటూ రామోజీ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని ప్రజలు గుర్తించాలి.
మూడు రోజులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ లు
ఈనాడు రాసిన విషయాన్ని పక్కనబెడితే మూడు రోజులకు పైబడి ఎవరైనా విద్యార్థులు బడికిరాకపోతే సంబంధిత తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ కూడా పంపించే పద్ధతిని విద్యాశాఖ అమలుచేస్తుంది. నాలుగో రోజు సంబంధిత వాలంటీర్ తో ఆ విద్యార్థి యోగక్షేమాలపై వాకబుచేసి మళ్లీ బడికి వచ్చే వరకూ మానిటరింగ్ వ్యవస్థ రాష్ట్రంలో నడుస్తోంది.అలాగే కమాండ్ కంట్రోల్- నుంచి విద్యా సమీక్ష కేంద్రాల ద్వారా విద్యార్థుల హాజరుపై పూర్తిగా పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థులు గైర్హాజరుపై హెడ్ మాస్టర్ల ద్వారా నిరంతరం వివరాలను సేకరిస్తుంది. అమ్మ ఒడి, విద్యాకానుక సహా పిల్లలకు ఏది ఇవ్వాలన్నా వారి నుంచి బయోమోట్రిక్ హాజరును తీసుకున్నాకే అందిస్తున్నారు. హాజరు దగ్గరనుంచి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇంత పగడ్బందీ విధానాలను అమలు నేపథ్యంలో బోగస్ వివరాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? పైగా అమ్మఒడి లాంటి పథకం పొందాలంటే తప్పనిసరిగా విద్యార్థులు 75శాతం హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. బయో మెట్రిక్ విధానం ద్వారానే హాజరును కూడా నమోదుచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విద్యార్థుల గైర్హాజరుపై ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మేలా ఈనాడు కథనాన్ని రాయడం జగన్ సర్కారుపై దానికున్న విద్వేషాన్ని బట్టబయలు చేస్తుంది.
పాఠశాలలు ప్రారంభమైన మొదటిరోజే పుస్తకాల పంపిణీ
బడితెరిచిన మొదటి రోజే బడిలో నమోదయిన విద్యార్థులందరికీ పుస్తకాలు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం అత్యంత మెరుగైన విధానాన్ని అనుసరిస్తోంది. 2023-24 అకడమిక్ ఇయర్ కోసం 4,61,80, 773 పుస్తకాలను పాఠశాలకు సరఫరా చేయగా కేవలం విద్యార్థులకు పంపిణీకోసమే కాకుండా కొన్ని బఫర్ నిల్వలను కూడా జిల్లా టెక్స్ట్ బుక్ ఆఫీస్ నందు నిల్వ చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు మధ్యలో వచ్చినా, లేక వారు పుస్తకాలు పోగొట్టుకున్నా వారికి వెంటనే పుస్తకాలు సరఫరాచేయడం జరుగుతోంది. అలాగే అడ్మిషన్ల తర్వాత వచ్చే పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన పుస్తకాలను తదుపరి సంవత్సరం పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పిల్లలకు అరకొరగా పాఠశాలలు ప్రారంభం అయిన తరువాత ఆరు నెలల వరకు పుస్తకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వడం తో పాటు పుస్తకాలు పోగొట్టుకున్న విద్యార్థులకు రెండవసారి కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఇవ్వగా మిగిలిన పుస్తకాలను జిల్లా పాఠ్యపుస్తక కార్యాలయంలో భద్రపరుస్తున్నారు.
పుస్తకాలు సకాలంలో ఇవ్వడం మాత్రమే కాకుండా వాటి నాణ్యత లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అంతే కాకుండా విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా బైలింగ్వల్ లాంగ్వేజ్ లో పుస్తకాలను జగన్ సర్కారు అందిస్తుంది. అదే విధంగా కన్నడ, ఒడియా, ఉర్దూ, తమిళం వంటి మైనారిటీ లాంగ్వేజ్ పుస్తకాలు కూడా సకాలంలో విద్యార్థులకు అందించింది. హాజరును బట్టి మరియు నమోదైన పిల్లలను ప్రత్యక్షముగా పాఠశాలకు వచ్చి తీసుకొనుట వలన ఎటువంటి అవకతవకలు జరగడానికి ఆస్కారమే లేదు.
విద్యార్థులందరికీ జేవీకే కిట్స్
అలాగే 2023-24 విద్యాసంవత్సరంలో 39,95,992 జేవీకే కిట్స్ సప్లయ్ ఆర్డర్ ఇవ్వడం జరిగినది. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే జూన్ మాసంలోనే పాఠశాలలకు హాజరైన 38,27,697 విద్యార్థులకి జేవీకే కిట్స్ పంపిణీ చేయగా మిగిలిన జేవీకే కిట్స్ మండల జేవీకే స్టాక్ పాయింట్ లలో భద్రపరిచారు. కిట్స్ పాడైపోయిన లేదా పోగొట్టుకున్న విద్యార్ధుల కు కూడా కిట్స్ తిరిగి అందిస్తున్నారు. ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేని విధంగా బయోమెట్రిక్ హాజరు తో పాటు రెగ్యులర్ హాజరు కూడా తీసుకొని కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. జేవీకే-3లో మిగిలినటువంటి జేవీకే కిట్స్ తదుపరి విద్యాసంవత్సరంలో స్పెసిఫికేషన్ల మారడం వల్ల వాటిని వృథా కాకుండా ఆ సంవత్సరంలోనే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్ఎస్ లోని ఇంటర్మీడియట్ తో పాటు అవసరమైన విద్యార్థులకు ఇస్తుండగా, బెల్టులు, నోట్ పుస్తకాలను జేవీకే-4లో వినియోగించుకోవడమైనది. కాబట్టి కిట్ల దుర్వినియోగం జరగడానికి ఆస్కారమే లేదు. జేవీకే 4 లో మిగిలిన కిట్స్ ను మండల జేవీకే స్టాక్ పాయింట్ లలో భద్రపరచి, తదుపరి విద్యాసంవత్సరంలో వినియోగిస్తున్నారు.
ఇక మధ్యాహ్న భోజనంలో భాగంగా ఎన్ రోల్ అయిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం సరుకులు ఇచ్చి, హాజరు ఆధారంగా విద్యార్థులకు సరిపడా భోజనాన్ని తయారు చేస్తున్నారు. ప్రతిరోజూ విభిన్నమైన ఆహారమే కాకుండా చిక్కి, రాగిజావలు కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతోంది. సగటున 86శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నారు. హాజరును అనుసరించిన భోజనాన్ని తయారుచేస్తున్నందున ఇక్కడ ఎలాంటి అవకతవకలకూ ఆస్కారం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల చదువు కోసం ఇంత పగడ్బందీగా పలు కార్యక్రమాలను అమలు చేస్తుంటే లేని పిల్లలకు కూడా పాఠ్యపుస్తకాలు పేరిట, విద్యాకానుక పేరిట, మధ్యాహ్న భోజనం పేరిట ఖర్చు చేసేస్తున్నారని, గొప్పలకోసం యత్నిస్తున్నారంటూ దురుద్దేశ పూర్వకంగా ఈనాడు అసత్య కథనం రాయడాన్ని గమనిస్తే ప్రభుత్వంపై ద్వేషంతో రామోజీ ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవచ్చు. అర్హులకు కాదనకుండా, అనర్హులకు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినా రామోజీకి మాత్రం కడుపు మంటగా మారిపోయాయి.