ఏపీ ఎలక్షన్ లో చర్చ జరుగుతున్న అతి ముఖ్యమైన అంశంగా వాలంటీర్లు నిలిచారు. వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారితో ఫించన్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తలుగా పని చేశారు. అయితే ప్రజల మీద వీరి ప్రభావం ఉంటుందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇతని డైరెక్షన్ లో పని చేసే జన సేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేసి వీరితో ప్రభుత్వ సంక్షేమ పనులకు దూరంగా వుండేలా తమ పలుకుబడి ఉపయోగించి అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వాలంటీర్లను అవమానించేలా మాట్లాడారు. దాని తరువాత రాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రమే మారిపోయింది.
ఇక్కడ నుంచి తమని అవమానించిన టీడీపీ, జనసేన తీరుకి నిరసనగా మొదలైన వాలంటీర్ల రాజీనామా అతి తక్కువ సమయంలోనే రాష్ట్రమంతటా వ్యాపించి 44,163 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అంటే జగన్ ప్రభుత్వము రెండు లక్షల మందికి వాలంటీర్ల గా అవకాశం కల్పిస్తే 44,163 అంటే దాదాపు 25% మంది ఇప్పటికే రాజీనామా చేశారు అని ఎలక్షన్ కమీషన్ వెల్లడించింది. వీరంతా టీడీపీ , జన సేన ఓటమే లక్ష్యంగా పనిచేస్తాము అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా కుప్పంలో 800 మందికి పైగా రాజీనామా చేసి టీడీపీని ఓడించి తీరుతాం అని ప్రకటించారు.
వాలంటీర్లు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు , వాలంటీర్లు మహిళల డేటా తీసుకొని వారి వివరాలతో కిడ్నాప్ లు జరుగుతున్నాయి, మగ వారు లేనప్పుడు డోరులు కొడుతున్నారు, ఫించన్ కావాలంటే మాకు ఏమి ఇస్తారు అంటూ ఇలా వాలంటీర్లను అవమానించేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు అవకాశం వచ్చిన ప్రతిసారి వాలంటీర్లు వ్యవస్థ మీద విషం చిమ్మారు. చివరకు ఎలక్షన్ కమీషన్ కు వాలంటీర్లు ఫించన్ ఇవ్వకుండా ఫిర్యాదులు చేసి వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి ఫించన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి అడ్డుకున్నారు. దాని తరువాత ఫించన్ ల కోసం రోడ్డు మీదకు వచ్చి వడదెబ్బ తగిలి దాదాపు 39 మంది వరకు చనిపోయారు. ఇది చూసి చలించిన వాలంటీర్లు తమ మీద అభాండాలు మోపడమే కాకుండా ఈరోజు వృద్ధుల మరణాలకు కారణం అయ్యారు, ఇక మాకు ఈ వాలంటీర్ల ఉద్యోగాలు కూడా వద్దు రాజీనామా చేస్తున్నాము అని ప్రకటించి ఒక్కొక్కరిగా తరువాత వందలు వందలు గా రాజీనామా చేశారు.
కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో 800 రాజీనామా చేసి బాబు ఓటమే మా లక్ష్యం అని ప్రకటించడం సంచలనం కలిగించింది. మచిలీపట్నం, టెక్కలి, మండపేట ఇలా చెప్పుకుంటూ పొతే చాలా చోట్ల నియోజకవర్గాలే ఖాళీ చేశారు. ఎప్పుడైతే వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ వెంట నడవటం మొదలు పెట్టారో అప్పుడు చంద్రబాబుకు భయం మొదలు అయ్యి నేను వాలంటీర్లకు వ్యతిరేకం కాదు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం పది వేలు చేస్తాము అని ప్రకటించారు అయిన చంద్రబాబు నాయుడి మాటలను విశ్వసించని వాలంటీర్లు రాజీనామాలు కొనసాగిస్తూనే వైసీపీ కి అనుకూలంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థ మీద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ చేసిన ప్రతీ మాటను ప్రజలకు వివరించడం మొదలుపెట్టారు. ఇవ్వని గమనిస్తే వాలంటీర్లు మొత్తం వైసీపీ వైపే వున్నారు. చంద్రబాబును విశ్వసించడం లేదని అర్ధమవ్వుతుంది .