చంద్రబాబు , జగన్ కి మద్య ఆలోచనల్లో ఉన్న తేడాని ప్రజలు నిశితంగా గమనిస్తునట్టు ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలసీలపై సోషల్ మాధ్యమాల్లో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. సామాన్య ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విధ్య, నాణ్యమైన వైద్యం, వసతి, ఉపాది. ఈ రంగాల పై జగన్ తన 5ఏళ్ళ పాలనలో ఫోకస్ చేసి పేదవారికి అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో ఏ నాయకుడు 5ఏళ్ల కాలంలో చేయలేనన్ని సంక్షేమ పధకాలు అందించి వారికి ఆర్ధికంగా, సమాజికంగా భరోసా కల్పించడంలో జగన్ పూర్తిగా విజయం సాదించారు.
అయితే చంద్రబాబు మాత్రం తన ప్రాధాన్యతల్లో విద్యా , వైధ్యం, వసతి, ఉపాది కన్నా కూడా ప్రజలకి నాణ్యమైన మధ్యం అందిస్తానని ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం చూస్తే 40ఏళ్ళ చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రజల అవసరాలను కూడా సరిగా గుర్తించలేని నాయకుడిగా మిగిలిపోయాడనే వాదన వినపడుతుంది. ప్రజలపై అక్కర ఉన్న నాయకులు ప్రజలచేత ఇలా మధ్యం తాగించే స్కీములు తెస్తాం అని బహిరంగంగా చెబుతారా అని సామాజికవేత్తల నుండి తెలుగుదేశం నాయకులకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
రాజకీయంగా , ప్రజలకి మేలు చేసే పరంగా జగన్ కి ఉన్న ఆలోచనలు అందుకోవడంలో చంద్రబాబు పూర్తిగా వెనకపడిపోయారని తెలుగుదేశం నేతలనుండే ఆఫ్ ది రికార్డ్ గా వస్తున్న మాట , మీడియా బలంతో నెట్టుకు రాగలుగుతున్నాం కానీ లేకుంటే జగన్ సంక్షేమ పాలనకి, రాజకీయంగా ఎప్పుడో కనుమరుగయ్యే వాళ్ళమని, చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కనీసం జగన్ లా ప్రజల గురించి ఒక్కరోజు కూడా అలోచించి ఉండరని అందుకే నేడు టీడీపీ ఇలా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని, ఆఖరికి సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు పై విపరీతమైన సెటైర్లు పడటానికి తమ విధానాలే కారణమని వారి నుండి వినిపిస్తున్న మాట .