రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి ఒక కుటుంబం నుండి ఒకే టికెట్ ఇస్తాం అని ఎప్పుడో ప్రకటించిన బాబు ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.. ఒకవేళ ఏదైనా రూల్ పెడితే ఆ రూల్ అందరికీ సమానంగా వర్తించాలి, ఎవరికోసమైనా తప్పాల్సి వస్తే అందరికీ ఆ సడలింపు ఉండాలి. కానీ బాబు దగ్గర అలాంటి సడలింపులేం ఉండవు. తన వారికి ఎన్నైనా ఇస్తాడు, తనకు అడ్డు అనుకునేవారికి అడ్డంగా కత్తిరిస్తాడు…
టీడీపీ కి ఎప్పటి నుండో ఉన్న పరిటాల కుటుంబానికి మాత్రం సునీత కు మాత్రం టికెట్ ఇచ్చి కొడుకు అయిన శ్రీరామ్ కు టికెట్ లేదని నిర్దాక్షిణ్యంగా చెప్పేసాడు. టీడీపీ కోసం నోటితో విరోచనాలు చేసుకునే అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కు అనకాపల్లి ఎంపీ టికెట్ కోరగా బహిరంగ సభ లోనే మందలించాడు. అలాగే అనంతపురం లో JC ఫ్యామిలీకి చెక్ పెట్టాడు.
కానీ కట్ చేస్తే చంద్రబాబు కుటుంబంలో చంద్రబాబు, లోకేష్,బాలక్రిష్ణ, బాలక్రిష్ణ చిన్న అల్లుడు భరత్ ఇలా 4 టిక్కెట్లు ఇచ్చారు. ఇక బీజేపీ నుండి పోటీ చేసినా బాబు మనిషే అయిన పురంధేశ్వరి తో కలుపుకుంటే మొత్తం 5 మంది వారి కుటుంబ సభ్యులకే టికెట్లు..
అలాగే యనమల రామకృష్ణుడు కుటుంబంలో యనమల అల్లుడు, కూతురు, వియ్యంకుడు ఇలా 3 టికెట్లు ఇచ్చారు. కింజరపు ఫ్యామిలిలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, రామ్మోహన్ నాయుడు బావ ఆదిరెడ్డి వాసు ఇలా 3 టికెట్లు ఇచ్చారు. ఇక వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ఫ్యామిలీకి కూడా నెల్లూరు ఎంపీ,కోవూరు ఇలా 2 టికెట్లు ఇచ్చారు….సోమిరెడ్డిని కూడా కలుపుకుంటే ఆ కుటుంభంలో 3 సీట్లు ఇచ్చినట్టు అవుతుంది.
ఇలా తనకు, తనకు నచ్చిన వాళ్ళకి మాత్రం ఈ రూల్స్ ఉండవు, తనకు అడ్డు అనుకునే వారికి మాత్రం బాబు రూల్స్ పక్కాగా వర్తిస్తుంటాయి..