పరిటాల సునీతకు తన కంచుకోట లాంటి రాప్తాడులో ఆదరణ కరువైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తన వెంట నడిచే నాయకులు, జెండా పట్టుకుని తిరిగే కార్యకర్తలు లేక అల్లాడిపోతున్న సునీత టీడీపీ వారికే మళ్ళీ టీడీపీ కండువాలు కప్పుతూ అభాసు పాలవతుండడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో తిరుగుతున్న సునీత తనకు కనపడిన ప్రతి మనిషికి అప్పటికప్పుడు టీడీపీ జెండా మెడలో వేస్తూ ఫొటోలు తీసి టీడీపీలో జాయిన్ అవుతున్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత రాప్తాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ పని అయిపోయింది, ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యలేడు అంటూ డాంభికాలు పలుకుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితులు పరిటాల సునీతకి ఏ మాత్రం అనుకూలంగా లేవు . పరిటాల కుటుంబం చేసిన మోసం వలనే తనకు ధర్మవరంలో బిజెపి టికెట్ దక్కలేదు అని రగిలిపోతున్న వరదాపురం […]
2019 ఎన్నికల్లో రాప్తాడు నుండీ పరిటాల సునీత ఓటమి తర్వాత ఆమె రాప్తాడు టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండగా, తనయుడు పరిటాల శ్రీరామ్ ని మూడేళ్ళ క్రితం ధర్మవరం ఇంచార్జీ గా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పటికే రాప్తాడు ఓడిపోయి ఉండటంతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ రోజు రోజుకీ మరింత బలపడుతుండడంతో ఇహ పై రాప్తాడులో రాజకీయం చేయటం కష్టమే అనుకొంటున్న పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇంచార్జి […]
అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ చరిత్ర గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పరిటాల , గంగుల కుటుంబాల మధ్య జరిగిన వర్గ పోరు గురించి చెప్పకుండా ఉండటం సాధ్యం కాదు. దశాబ్ధాలుగా కొన్ని వందలమంది ఈ ఫ్యాక్షన్ కి బలైపోయారు. వర్గ కక్షలతో గ్రామాలకు గ్రామాలే కాలి బుగ్గైపోయిన ఘటనలు కోకోల్లలని చెప్పవచ్చు. అయితే తెలుగుదేశం సీనియర్ నాయకుడు పరిటాల రవి హత్య అనంతరం తగ్గు ముఖం పట్టిన ఫ్యాక్షన్ హత్యలు దశాబ్దకాలంగా క్రమేపీ కనుమరుగయ్యాయనే చెప్పాలి. వెంకటాపురం కేంద్రంగా […]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి ఒక కుటుంబం నుండి ఒకే టికెట్ ఇస్తాం అని ఎప్పుడో ప్రకటించిన బాబు ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.. ఒకవేళ ఏదైనా రూల్ పెడితే ఆ రూల్ అందరికీ సమానంగా వర్తించాలి, ఎవరికోసమైనా తప్పాల్సి వస్తే అందరికీ ఆ సడలింపు ఉండాలి. కానీ బాబు దగ్గర అలాంటి సడలింపులేం ఉండవు. తన వారికి ఎన్నైనా ఇస్తాడు, తనకు అడ్డు అనుకునేవారికి అడ్డంగా కత్తిరిస్తాడు… […]
2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా మీరెవరూ రుణాలు తిరిగి చెల్లించొద్దు అన్న చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాలు తమ బకాయిలు చెల్లించకపోవడంతో వడ్డీలు అపరిమితంగా పెరిగిపోవడమే కాక, నిరర్ధక బకాయిలుగా బ్యాంక్ లు ప్రకటించే పరిస్థితి వచ్చింది . ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ద్వాక్రా రుణమాఫీ చేయకుండా రాష్ట్ర మహిళల్ని వంచించడంతో రాష్ట్ర మహిళా లోకం నివ్వెరపోయింది. టీడీపీ ప్రభుత్వం చేసిన మోసంతో పొదుపు సంఘాలన్నీ దాదాపు […]
టీడీపీ హయాంలో 1613 రహస్య జీవోలు వెన్నెల వెలుగులా అంటూ వైసీపీ సోషల్ మీడియా సెటైర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో పారదర్శకత గురించి టీడీపీ నేతలు మాట్లాడేది వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. బోగి మంటల సాక్షిగా పరిటాల సునీత “ జగన్ పరిపానలంతా చీకటి జీఓలు, కక్ష్య సాధింపులే “ అంటూ అబద్ధపు ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1613రహస్య జీవోలు రిలీజ్ అయ్యాయి.. శాఖల వారీగా దోచుకునేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి […]